E-Paper
Advertisement

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?
Advertisement

Babu Mohan On The Paradise Movie: సాధారణంగా ఒక సినిమాలో పాత్రల కోసం కొంతమంది నటీనటులను ఎంపిక చేసి కొన్ని కారణాల వల్ల వారిని రిజెక్ట్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం. ఈ నేపథ్యంలోనే ఇటీవల నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఒక్కరోజు కూడా ఆడలేదు..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్ (Babu Mohan)చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. నాని ది ప్యారడైజ్ సినిమాలో తనకు కూడా అవకాశం ఇచ్చారు తనని పిలిపించి లుక్ టెస్ట్ కూడా చేసి అనంతరం తనని రిజెక్ట్ చేశారని ఈయన మాట్లాడారు. ఇలా ప్యారడైజ్ సినిమా నుంచి తనని తప్పించడం గురించి బాబు మోహన్ మాట్లాడుతూ.. ది ప్యారడైజ్‌లో వేషం కోసం గెటప్ వేసారు..మేకప్‌ టెస్ట్‌ చేశారు. గెటప్‌ బాగుందన్నారు.. షూట్ ఉన్నప్పుడు పిలుస్తాం అన్నారు. నేను పనికిరాను అనుకున్నారేమో పిలువలేదనీ తెలిపారు. బహుశా
సినిమా ఫ్లాప్‌ కావాలని రాత రాశారేమో.. ఈ సినిమా ఫ్లాప్‌ అయింది.. ఒక్క రోజు కూడా ఆడలేదనీ ఈయన మాట్లాడారు.

బాబు మోహన్ గోల్డెన్ లెగ్..

Advertisement

ఇవివి సత్యనారాయణ గారు తనని గోల్డెన్ లెగ్ అంటూ మాట్లాడుతారు ఆయన తీసిన చెవిలో పువ్వు సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది అందులో నేను నటించలేదు అలాగే ఇవివి గారు ప్రేమఖైదీ సినిమా చేస్తే సూపర్ హిట్ అయింది అందులో నేను ఉన్నాను అంటూ బాబు మోహన్ ఈ సందర్భంగా మాట్లాడారు దీంతో ఈయన మాటలు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. బాబు మోహన్ గోల్డెన్ లెగ్ అయితే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావాలి కదా ఎందుకు డిజాస్టర్ అయ్యాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక సినిమాలో ఒక పాత్రలో తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది దర్శక నిర్మాతల చేతుల్లో ఉంటుంది.

లుక్ టెస్ట్ చేస్తే సినిమాలో తీసుకోవాలా?

బాబు మోహన్ ను ది ప్యారడైజ్ సినిమాలో రిజెక్ట్ చేయడంతో ఇలా మాట్లాడటం సరికాదంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈయనని సినిమాలో తీసుకోలేదని బాధతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? లేదా అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లుక్ టెస్ట్ కు పిలిచినంత మాత్రాన సినిమాలో తీసుకోవాలని రూల్ ఏమీ లేదు కదా! అంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు. ఇక మీరు గోల్డెన్ లెగ్ అయితే ప్రతి ఒక్క సినిమాలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా ఈయన పై విమర్శిలు చేస్తున్నారు. ఇలా మోహన్ బాబు ది ప్యారడైజ్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Advertisement

Also Read: నాతో డేట్ కు రావాలంటే అబ్బాయిలు ఇవి తీసుకురావాల్సిందే: అనస్వర రాజన్

Related News

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

నాతో డేట్ కు రావాలంటే అబ్బాయిలు ఇవి తీసుకురావాల్సిందే: అనస్వర రాజన్

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు

‘బౌలీ ఆర్ట్ సంఘం’ చైర్ పర్సన్ గా అల్లు అర్జున్ భార్య!

శేఖర్ మాస్టర్ కు ప్రమాదం..స్పందించిన జానీ మాస్టర్ ..ఇప్పుడు ఎలా ఉందంటే?

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

Big Stories

Advertisement
×