E-Paper
Advertisement

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !
Advertisement

Tharun Bhascker:తరుణ్ భాస్కర్ .. పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టేశాడుఈ క్రేజీ యంగ్ ఫిలిం మేకర్.ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది ’ సినిమా కూడా యూత్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.

అయితే ఆ తర్వాత వచ్చిన కీడా కోలా సినిమా అనుకున్నంత ఆడకపోయేసరికి నటన మీద ఫోకస్ పెట్టిన తరుణ్ మళ్ళీ ఐయాం బ్యాక్ అంటూ ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ గా ఈ నగరానికి ఏమైంది 2 ని తెరకెక్కించి మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు.ఇక ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కి సిద్దం కావడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఇక అందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ ఇండస్ట్రీపై చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

తరుణ్ మాట్లాడుతూ .. ఈ ENE రిపీట్ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ తనలో టెన్షన్ పెరుగుతోందని గతంలో తాను చేసిన సినిమాలతో పోలిస్తే ఈసారి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కల్ట్ ఫాలోయింగ్ కారణంగా ఈ సీక్వెల్‌పై ఒత్తిడి చాలా పెరిగిందని తెలిపాడు.

ఇక చాలామందికి తెలియని విషయం .. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తీసేటప్పుడే పార్ట్ 2 చేయాలనే ఆలోచన తనకు లేదని తరుణ్ భాస్కర్ స్పష్టం చేశాడు. మొదటి భాగాన్ని పూర్తిగా సింగిల్ సినిమాగానే అనుకుని తీశానని తెలిపాడు.

Advertisement

అయితే ‘పెళ్లి చూపులు’ సూపర్ హిట్ అయిన తర్వాత తనపై ఎక్కడ లేని ప్రెజర్ పెరిగిపోయిందని,దాని నుండి బయటకి వచ్చేందుకు తన ఫ్రెండ్స్ లైఫ్స్ ,వారికి జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకునే‘ఈ నగరానికి ఏమైంది’ కథను రాసుకున్నానని వివరించాడు.

ఇక ఈ సినిమా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సినిమాకి సంబందించిన కలెక్షన్స్ ని బయటపెట్టాడు.థియేటర్లలో 45 రోజులకుపైగా రన్ అవడంతో పాటు ఓటీటీలోనూ మంచి అప్లాజ్ దక్కిందని అయితే పెళ్లి చూపులు’సూపర్ హిట్ అవ్వడం వల్ల దానితో పోల్చి తక్కువ చేసేవారని తెలిపారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తరుణ్ సినిమాలకి ఇచ్చే రివ్యూలు, సోషల్ మీడియాలో నడిచే నెగెటివిటీ పై తన దైన శైలిలో కామెంట్స్ చేసుకొచ్చాడు.ముఖ్యంగా మొదట్లో తన సినిమాలపై నెగెటివిటీ వస్తే,లోపాలని ఎత్తి చూపితే చాలా బాధ పడ్డానని,కానీ తర్వాత ఆ విమర్శలని అర్థం చేసుకున్నానని వివరించాడు.

అయితే సినిమా లపై సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చే తీరు మారాలని,సినిమా నచ్చిందా నచ్చలేదా అని చెప్పడం కంటే దాని మీద ఇష్టం వచ్చినట్టుగా అనాలసిస్ లు చేయడం,భూతద్దంలో పెట్టి చూడటం వంటి అతి తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ తన మనసులోని మాటని బయటపెట్టాడు.ఒక రకంగా ఇదే ఇండస్ట్రీలో అతి పెద్ద సమస్య లా మారిందని తెలిపాడు.

అయితే రివ్యూలు ఉండకూడదని తాను అనడం లేదని మంచి విమర్శలు సినిమా పరిశ్రమకు అవసరమని తెలిపాడు.మొత్తంగా తరుణ్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారిపోయాయి.

ALSO READ :కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

Tags

Related News

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

నాతో డేట్ కు రావాలంటే అబ్బాయిలు ఇవి తీసుకురావాల్సిందే: అనస్వర రాజన్

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు

Big Stories

Advertisement
×