E-Paper
Advertisement

అడవుల్లో జోకర్ అరాచకం… 2016లో అమెరికాని షేక్ చేసిన క్లౌన్ల ఘటన… ఆ భయం వెనకున్న అసలైన కథ

అడవుల్లో జోకర్ అరాచకం… 2016లో అమెరికాని షేక్ చేసిన క్లౌన్ల ఘటన… ఆ భయం వెనకున్న అసలైన కథ
Advertisement

True Story Documentary: నిజ జీవితంలో జరిగిన కొన్ని వింత సంఘటనలు హారర్ సినిమాల కంటే ఎక్కువగా భయపెడతాయి. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2016లో అమెరికాలో ఓ వింత భయాందోళన మొదలైంది. రాత్రిపూట అడవుల్లో, స్కూళ్ల దగ్గర భయంకరమైన జోకర్ వేషధారణలో వ్యక్తులు కనిపిస్తున్నారనే వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలతో ప్రజల్లో భయం పెరిగి, పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వింత సంఘటనల వెనుక అసలు నిజమేంటో పరిశీలిస్తూ తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘Clown Panic’. ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ ఎడ్ పెర్కిన్స్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఈ రోజు నుంచి (నవంబర్ 12) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఏ ఓటీటీలోకి వచ్చింది ? పదేళ్ల క్రితం అమెరికాను కలవరపెట్టిన ఆ క్లౌన్ పానిక్ వెనుక కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ డాక్యుమెంటరీ కథ 2016 ఆగస్టులో అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో మొదలైన కొన్ని వింత ఫిర్యాదులతో ప్రారంభమవుతుంది. గ్రీన్‌విల్లే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న అడవుల్లో జోకర్ వేషధారణలో కొందరు వ్యక్తులు కత్తులతో కనిపిస్తున్నారని పిల్లలు చెప్పడంతో స్థానికంగా కలకలం మొదలవుతుంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు అప్పట్లో స్పష్టమైన ఆధారాలను గుర్తించలేకపోయారు. కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా రాత్రి పూట రోడ్లపై, స్కూళ్ల దగ్గర కత్తులు పట్టుకున్న జోకర్లు తిరుగుతున్నారనే పుకార్లతో దేశవ్యాప్తంగా స్కూళ్లకు లాక్‌డౌన్ ప్రకటించే పరిస్థితి వచ్చింది. అమెరికాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా జోకర్లు కనిపించారంటూ ఫొటోలు, వీడియోలు, పోస్టులు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల స్కూళ్లకు బెదిరింపులు రావడంతో భద్రతా చర్యలు చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనల్లో చాలా వరకు పుకార్లు, ఆకతాయిల చేష్టలు, ధృవీకరించని ఫిర్యాదులే ఉన్నాయని అప్పటి దర్యాప్తులు వెల్లడించాయి.

Advertisement

అసలు ఈ భయం ఎలా మొదలైంది? అడవుల్లో జోకర్లు కనిపించారన్న వార్తలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా వ్యాపించాయి? సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, పుకార్లు ప్రజల ఆలోచనలను ఎలా ప్రభావితం చేశాయి? ఈ హడావుడి వల్ల నిజమైన జోకర్ల వృత్తిపైనా, వారి జీవితాలపైనా ఎలాంటి ప్రభావం పడింది? అనే అంశాలను ఈ డాక్యుమెంటరీ పరిశీలిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల అనుభవాలు, పోలీసుల వాంగ్మూలాలు, అప్పటి ఆర్కైవ్ వీడియోలు, వైరల్ క్లిప్పింగ్స్ ద్వారా ఆ రోజుల్లో నెలకొన్న భయాందోళనలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ డాక్యుమెంటరీ. మొత్తానికి సోషల్ మీడియా పుకార్లు ఒక దేశాన్ని ఎలా సైకలాజికల్ భయంలోకి నెట్టేశాయి అనే అసలైన కథను ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

‘Clown Panic’ ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం. ఎడ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించగా, జోనాథన్ చిన్, సైమన్ చిన్ నిర్మాతలుగా వ్యవహరించారు. సుమారు 84 నిమిషాల నిడివితో రూపొందిన ఈ డాక్యుమెంటరీ 2026 నవంబర్ 12న విడుదలైంది. ఇంగ్లీష్ భాషలో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

Tags

Related News

ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

డైనోసార్ల ఐలాండ్‌లో చిక్కుకున్న పా పెట్రోల్ టీమ్… అగ్నిపర్వతం బద్దలైతే అదిరే ప్లాన్… పిల్లలకు ఫుల్ మీల్స్

చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

Big Stories

Advertisement
×