Malaika Arora:మలైకా అరోరా..వయసు వయసు పెరుగుతున్నా ఎక్కడా తగ్గనంటూ కుర్ర భామలకి దీటుగా అందాలని ఒలికించే పనిలో పడింది ఈ వెటరన్ బ్యూటీ.ఒక పక్క సినిమాలు ఇంకో పక్క టెలివిజన్ షోలు, మరో పక్క ఫ్యాషన్ ఈవెంట్స్ అంటూ ఎప్పుడూ వార్తల్లో ఉండే మలైకా.. ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.ఇదిగో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
మలైకా తన ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలను షేర్ చేస్తూ.. “You got it, you flaunt it” అంటూ క్రేజీ క్యాప్షన్ యాడ్ చేయడంతో ఫిదా అయిపోయారు ఫాలోవర్స్.ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇక దానికి తగ్గట్టుగా వేసుకున్న బెల్ట్, మెడలో నెక్లెస్, చేతికి బ్రేస్లెట్స్తో తాను ఫ్యాషన్ ని సరిగ్గా ఫాలో అయితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. ముఖ్యంగా సిటీ లోని నైట్ లైటింగ్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చిన ఫోజులు ఫొటోలకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. ఇక ఏజ్ పెరుగుతున్నా ఇప్పటికీ తనదైన స్టైల్ తో యూత్ ని ఎలా ఆకట్టుకోవాలో ఈ భామకి బాగా తెలుసంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు మలైకా ఫాన్స్.
ఇక మలైకా అరోరా అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఆమె డ్యాన్స్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ సినిమాలోని ‘ఛయ్య ఛయ్య’ పాటతో నేషనల్ వైడ్ గా సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది .ఇక పాటకి కొరియోగ్రఫీ అందించిన ఫరాఖాన్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది కూడా.
అలాగే సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాలోని మున్నీ బద్నాం హోయి అనే పాట మలైకా కెరీర్లోనే ఒక మైల్ స్టన్ అని చెప్పాలి. ఈ పాట వచ్చిన కొత్తల్లో ఆడియన్స్ ని షేక్ చేసేసింది.ఇక ఈ పాటని హమ్ చేయని ఆడియన్స్ లేరంటే ఆశ్చర్యం లేదు. అలాగే ‘కాంటే’, ‘హౌస్‌ఫుల్ 2’ వంటి సినిమాల్లోనూ కనిపించి మెప్పించింది ఈ వెటరన్ భామ.
అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీలోనూ తనకంటూ సాలిడ్ క్రేజ్ సంపాదించుకుంది మలైకా.ముఖ్యంగా ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’, ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ వంటి షోస్ లలో జడ్జిగా కనిపించి మరింత మంది ఆడియన్స్ కి దగ్గరైపోయింది.ఒకరకంగా అటు సినిమాలు ,ఇటు ఫిట్ నెస్ ,మరో వైపు డాన్స్ ఇలా అన్ని రంగాల్లో తనదైన స్టాంప్ వేస్తూ సాగిపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో మలైకా చూపించే కేరింగ్ చాలామందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.ఇక యోగా ,ఫిట్ నెస్ ,లైఫ్ స్టైల్ వంటి వాటికి సంబందించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో వదులుతూ నెటిజన్లని అలరిస్తుంది కూడా.అందుకే మలైకా అప్ డేట్స్ పై ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతుంటారు నెటిజన్లు.
ఇక ఈ క్రమంలోనే మరిసారి ‘యూ గాట్ ఇట్.. యూ ఫ్లాంట్ ఇట్’ అంటూ క్యాప్షన్ ని జోడించి పెట్టిన ఫోటోలు ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయాయి. మొత్తానికి కొత్త సినిమాల అప్డేట్స్ లేకపోయినా, సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న ఈ భామ గ్లామర్‌కు, ఫ్యాషన్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి క్రేజీ పిక్స్ తో ప్రూవ్ చేసేసింది.