E-Paper
Advertisement

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!
Advertisement

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం ..షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో తొలి సినిమా రాజావారు రాణి గారు సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేశాడు.ఇక అప్పటి నుండి తనవైన సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న కిరణ్ ఇపుడు ‘రియాలిటీ’ సినిమాకి దర్శకుడిగా మెగా ఫోన్ పట్టేస్తున్నాడు.

పైగా ఇందులో హీరోగా కూడా తనే చేయడం విశేషం.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఉన్నంతలో అనే పాట రిలీజ్ అయి సినిమా కి మాంచి బజ్ తెచ్చిన సంగతి తెల్సిందే.ఇక ఇదే క్రమం లో తాజాగా మరో పాటని వదిలారు మేకర్స్ .

Advertisement

ప్రేమలో పడిన ఓ అబ్బాయి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఈ పాటలో చూపించారు మేకర్స్.ముఖ్యంగా నచ్చిన అమ్మాయి పక్కన ఉంటే కలిగే ఆనందం, ఆమె కొంచెం పలకరిస్తేనే మనసులో వచ్చే సంతోషం.. ఇలా ప్రేమలో ఉండే చిన్న చిన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ‘రుత్తు’ పాటలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.ఇక కొత్తగా ప్రేమలో పడిన అబ్బాయిలకి ఈ పాట బాగా కనెక్ట్ అయ్యేలా ఉందనడంలో సందేహం లేదు.

ఇక పూర్ణాచారి అందించిన లిరిక్స్ ఈ పాటకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా “చిన్ని చిన్ని కళ్లల్లోనా ఆనందమే చూస్తూ ఉన్నా..” అంటూ వచ్చే లైన్స్ నెక్స్ట్ లెవెల్.ఇక ప్రేమలో పడిన తర్వాత అమ్మాయి చేసే ప్రతి చిన్న పనిని కూడా ప్రత్యేకంగా చూపిస్తూ సినిమాపై అంచనాలని పెంచేశారు మేకర్స్.

Advertisement

సాధారణంగా మాస్ పాటలతో అదరగొట్టే భీమ్స్.. ఈసారి మాత్రం రియాలిటీ సినిమాకి మాంచి మెలోడీ ట్యూన్స్ ఇవ్వడం విశేషం.ఇక ఇందులో మధ్యలో వచ్చే జానపద, క్లాసికల్ బీట్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా కట్టి పడేస్తున్నాయి. ఇక కపిల్ కపిలన్ తన గొంతుతో అయితే మ్యాజిక్ చేశాడనే చెప్పాలి.ఇక కనిపించిన పాటలో కిరణ్ అబ్బవరం, దేవిక భట్ ల మధ్య కూడా కెమిస్ట్రీ సాలిడ్ గా వర్కౌట్ అయిపొయింది.

ఇక కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే.. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ సినిమాలతో ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించిన కిరణ్ ‘క’ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి ఒక్క సారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఇక K.ర్యాంప్ కూడా కిరణ్ అబ్బవరం ని మరో మెట్టు ఎక్కించిందే.. ఇప్పుడు ‘రియాలిటీ’ అంటూ ఏకంగా దర్శకత్వం చేస్తుండటంతో ఈ సినిమాని కిరణ్ ఎలా తెరకెక్కించాడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా.

ఇక ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్ కుమార్, సాయి కుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. JOY Films LLP బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తుండగా  విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.ప్రకటించారు. ప్రస్తుతం ‘రుత్తు’ పాటతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.చూడాలి మరి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్న కిరణ్ కి రియాలిటీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

ALSO READ :కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

 

Tags

Related News

ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్ !

మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

నాతో డేట్ కు రావాలంటే అబ్బాయిలు ఇవి తీసుకురావాల్సిందే: అనస్వర రాజన్

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

Big Stories

Advertisement
×