Tanveer Ahmed On IND VS NEPAL: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో నేపాల్, టీమిండియా ( India A vs Nepal, 4th Match, Group B) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టును 26 పరుగులకు ఆలౌట్ చేసి.. సూపర్ విక్టరీ అందుకుంది టీమిండియా. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. బలహీన నేపాల్‌ను ఓడించి సంబరాలు చేసుకోవద్దని.. నవంబర్ 22న నరకం చూపిస్తామంటూ హెచ్చరించాడు. నేపాల్ లాంటి పసికూనను ఓడించడం కాదు, దమ్ముంటే ఆదివారం పాకిస్తాన్ జట్టును ఎదుర్కోండి అంటూ సవాల్ విసిరాడు.
నేపాల్ జట్టును ఓడించి, టీమిండియా ప్లేయర్లు తెగ సంబరపడిపోతున్నారు.. కానీ పాకిస్తాన్ మ్యాచ్ లో ఓడిపోతే, మాత్రం ఘోరంగా ఏడుస్తారంటూ బాంబ్ పేల్చాడు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ నే ఓడించిన తర్వాత భారత కుర్రాళ్లు రెచ్చిపోయారని గుర్తు చేశాడు. ఆ అవమానాన్ని పాకిస్తాన్ లో ఎవరూ మర్చిపోలేదన్నాడు. కచ్చితంగా దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ లో టీమిండియాను ఓడించడమే కాదు, టైటిల్ కూడా గెలుస్తామని శపథం చేశాడు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో శుక్రవారం టీమిండియా, నేపాల్ మధ్య గ్రూప్ స్టేజ్ లో భాగంగా 4వ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా ఏ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడిన తిలక్ వర్మ సేన 9 వికెట్లు నష్టపోయి ఏకంగా 332 పరుగులు సాధించింది. తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా సూపర్ సెంచరీలు చేసి, రెచ్చిపోయారు. అయితే, 333 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో నేపాల్ 11.3 ఓవర్లు ఆడి 26 పరుగులు ఆలౌట్ అయింది. ప్రిన్స్ యాదవ్ 5 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా 4 వికెట్లతో రెచ్చిపోయాడు. దీంతో నేపాల్ పై సూపర్ విక్టరీ అందుకుంది భారత్. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన కుమార్ కుషాగ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అటు నవంబర్ 22న అంటే ఆదివారం టీమిండియా, పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది.