Prabhas: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. తెలుగులో ఉన్న స్టార్లు అందరి కంటే కూడా మొదటగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ విపరీతంగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ మూడు సినిమాలు కి విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ స్టాండర్డ్స్ ప్రభాస్ క్రియేట్ చేశాడు. ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే కలెక్షన్ సునామీ మొదలైంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్లో రెండు వెయ్యి కోట్లు సినిమాలు. 500 కోట్లు దాటిన సినిమా ఉన్నాయి.
ఇప్పుడు చాలామంది చాలామంది హీరోలు పాన్ ఇండియా పాన్ ఇండియా అని సినిమాలు గురించి మాట్లాడుతున్నారు. కానీ అందరికంటే ముందు పాన్ ఇండియా సినిమా చేశాడు ప్రభాస్. ప్రభాస్ స్టామినో ఏంటో ఆ సినిమాతో అర్థం అయిపోయింది. అయితే ఇదే విషయాన్ని యంగ్ హీరో తేజ కూడా తనదైన శైలిలో తెలిపాడు. ప్రభాస్ అన్న హనుమంతుడు లాంటివాడు.
హనుమంతుడి శక్తి ఏంటో తనకే తెలియనట్లు ప్రభాస్ అన్న స్టామినా ఏంటో ప్రభాస్ అన్నకి తెలియదు అంటూ చెప్పాడు. వాస్తవానికి తేజ చెప్పిన మాటలతో కూడా ఒప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ప్రభాస్ నుంచి లాస్ట్ గా వచ్చిన కల్కి సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు ప్రభాస్.
ఈరోజు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చాలా తెలుగు సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ప్రభాస్ వేసిన ఒక దారి అని చెప్పాలి. మొదట ప్రభాస్ బాహుబలి సినిమాతో సక్సెస్ కొట్టాడు కాబట్టి చాలామందికి అది ఒక విసిటింగ్ కార్డులో పనికొస్తుంది. ఇక తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ నటిస్తున్న సినిమా మిరాయి. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ ప్రభాస్ గురించి పై మాటలను పంచుకున్నాడు.
Also Read : Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?