Actor Arrested in Rape Case: మహిళ అత్యాచారం కేసులో బుల్లితెర హీరో, టీవీ నటుడు ఆశిష్ కపూర్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశిష్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఇటీవల మహారాష్ట్ర పూణే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పూణే పోలీసులు ఆశిష్పై కేసు నమోదు చేశారు. అతడిపై ఆరోపణలు వస్తున్న తరుణంలో ఆశిష్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఢిల్లీ పోలీసులు బ్రందాలు ఏర్పడి గాలింపు చర్యలు మొదలు పె ట్టారు, చివరికి అతడి పూణేలో అరెస్టు చేశారు.
‘యే రిషిత క్యా కెహ్లెతా హై’, ‘దేఖా ఏక్ క్యాబ్’ వంటి సీరియల్స్తో అతడు మంచి గుర్తింపు పొందాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. గత ఆగస్టు రెండో వారంలో ఆశిష్ తన ఇంటిలో పార్టీ ఉందని తనని ఆహ్వానించాడని, ఆ పార్టీకి వెళ్లిన తనని వాష్ రూంలో తీసుకువెళ్లి తనని బలవంతం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి ఆపై ఆ ఘటనలో రికార్డు చేసి తనని బెదిరిస్తున్నట్టు ఆరోపించింది. మొదట బాధిత మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పినట్టు ఢిల్లీ పోలీసుల అధికారిక తెలిపారు. సదరు మహిళ తన ప్రాథమిక ఫిర్యాదులో తనపై గ్యాంప్ రేప్ జరిగిందని ఆరోపించింది.
వారి పేర్లను కూడా ఆమె వెల్లడించింది. ఆగష్టు 11న ఆశిష్ కపూర్ తన స్నేహితులతో కలిసి తనపై అత్యాచారం చేశాడని తన ప్రాథమిక ఫిర్యాదులో పేర్కొంది. వారి పేర్లను కూడా పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఆమె తన వాగ్మూలనం మార్చింది. ఆశిష్ ఒక్కడే తనపై అత్యాచారం చేశాడని రెండో ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై కూడా మేము చట్టపరమైన అభిప్రాయం తీసుకుంటున్నామని పోలీసు అధికారిక చెప్పారు. అయితే ఆమె ఫిర్యాదు తర్వాత నటుడు ఆశిష్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలించగా.. సెప్టెంబర్ 4న పూణే పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై అతడిని విచారిస్తున్నామన్నారు.