High Court Shocks OG Team: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టీంకి హైకోర్టు షాకిచ్చింది. మరికొద్ద గంట్లలో ప్రీమియర్స్రిక రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో హైకోర్టు సస్పెండ్ చేస్తూ.. ఓజీ టీంకి ఊహించని షాకిచ్చింది. కాగా సెప్టెంబర్ 25న అంటే రేపు విడుదల అవుతున్న ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం టికెట్స్ రేట్స్ పెంచుతూ.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓజీ మూవీపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేశారు. కాగా మహేష్ యాదవ్ అనే వ్యక్తి.. ఓజీ మూవీ టికెట్ రేట్స్ పెంపుకు అనుమతిస్తూ ఇచ్చిన జీవోన అతడు సవాలు చేస్తూ హైకోర్టులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై నేడు విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ మెమోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేసింది. అయితే, ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రదర్శితమయ్యే ప్రీమియర్స్ షోలు, కొనుగోలైన టికెట్స్ రేట్లపై సందిగ్ధత నెలకొంది. ఓజీ ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు టికెట్స్ ఎగబడుకొంటున్నారు. కొన్ని సెలక్టెడ్ థియేటర్లలో మాత్రమే ప్రీమియర్స్ ఉంటాయి. కానీ, ఓజీ సినిమా వస్తున్న హైప్తో దాదాపు పీవీఆర్, ఐనాక్స్, ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్లలో ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇక దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి కూడా రావడంతో థియేటర్ యాజమన్యాలు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టేశారు. ఇప్పటి ప్రీమియర్స్ షో టికెట్స్ దాదాపు సేల్ అయిపోయాయి. అన్నిచోట్ల హౌజ్ ఫుల్ థియేటర్లు కనిపిస్తున్నాయి.
టికెట్స్ బుకింగ్స్ కోసం అభిమానులు, మూవీ లవర్స్ అంత ఎగబడుతున్నారు. ఇలా ఒపెన్ అయ్యాయో లేదో.. వెంటనే సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. ఒక్కొక్కొ టికెట్ ధర రూ. 800 నుంచి రూ. 2000 వరకు పలుకుతుంది. ప్రీమియర్స్ టికెట్స్ రేట్స్ భారీగా పెంచిన అభిమానులు మాత్రం వాటిని ఖతరు చేయడం లేదు. కానీ, తెలంగాణ హైకోర్టు మాత్రం అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మూవీ ప్రీమియర్స్ అనుమతి ఇవ్వడంతో టికెట్స్ రేట్స్ పెంచడంపై అభ్యంతరం తెలిపింది. ఏ ప్రతిపాదికన టికెట్ రేట్స్ పెంచారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన మోమోని సస్పెండ్ చేస్తు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ తీర్పు ఇచ్చారు. దీంతో తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ రేట్లపై సందిగ్ధత మొదలైంది.
టికెట్స్ రేట్స్ తగ్గితే.. ఇప్పటికే కోనుగోలైన టికెట్స్ సంగతేంటి, దీనిపై మూవీ మేకర్స్, థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయని ఆసక్తి నెలకొంది. కాగా రేపు(సెప్టెంబర్ 25) మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ముందు రోజు రాత్రి 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్స్ షో లు పడనున్నాయి. ప్రచార పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమా ఈ రేంజ్లో బజ్ ఉండటంతో అదే రేంజ్ ప్రీమియర్స్ షో లకు కూడా భారీ స్పందన వస్తుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ మోహన్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.