Producer Shocks to Cine Workers: ప్రస్తుతం టాలీవుడ్లో బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ వేతనాలు పెంపును డిమాండ్ చేస్తూ సినీకార్మికులు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చి సమ్మెకు దిగాయి. రెండో రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. తమ వేతనాలు పెంచితే కానీ, షూటింగ్లో పాల్గొనమని, అగ్రీమెంట్ ప్రకారం ఈ ఏడాది 30 శాతం వేతనాలను పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నిర్మాతలు మాత్రం వేతనాలు పెంచేదే లేదని తేల్చేసాయి. ఇక రెండు రోజులు సినీ కార్బికులు, నిర్మాతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిర్మాతల నిర్ణయంతో సినీ కార్మికులు భగ్గమంటున్నారు.
నిర్మాతల షాకింగ్ నిర్ణయం
షూటింగ్లో ఎవరూ పాల్గొనకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పలు షూటింగ్స్కి అంతరాయం కలిగించడమే కాదు.. షూటింగ్లకు హాజరువుతున్న కార్మికుల సభ్యులను బెదిరిస్తూ షూటింగ్లకు రాకుండ అడ్డుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లకు కూడా అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో నిర్మాతల మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మెలో గొడవలు చేస్తూ.. షూటింగ్లకు అంతరాయం కలిస్తున్న వారికి ఝలక్ ఇచ్చింది. భవిష్యత్తులో అలాంటి వారు సినిమా షూటింగ్లో పాల్గొనకుండా, వారిని తీసుకోకుడదనే నిర్ణయం తీసుకున్నారట నిర్మాతలు.
కొనసాగుతున్న సమ్మె
ప్రస్తుతం ఈ వ్యవహరం సినీ కార్మికుల్లో మరింత ఆందోళనక గురి చేస్తున్నారు. మరి నిర్మాతల ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు రియాక్షన్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ సినీకార్మికుల సమ్మె విషయంపై తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు లేబర్ కమిషన్‌తో మంగళవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ భేటీ కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశం అనంతరం నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమ్మె విషయంలో నిర్మాతలదే తప్పు ఉందని, కార్మికుల డిమాండ్లో న్యాయం ఉందని ప్రముఖ నిర్మాత చిట్టిబాబు ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికులు సమ్మె చేయడంలో తప్పులేదని, నిర్మాతలు కూడా వీరి విషయంలో తప్పు చేస్తున్నారని అన్నారు.
షూటింగ్స్ అడ్డుకున్న నిర్మాతలు
ఇక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలకు 30 శాతం పెంచాలని ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫేడరేషన్ మధ్య ఒప్పందం. ఇందులో భాగంగా ఈ ఏడాది వేతనాలు పెంచాలని కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేయగా.. ఒకసారి 30 శాతం పెంచడం భావ్యం కాదని తెలిపారు. ఇప్పటికే తాము ఎక్కువగా ఇస్తున్నామని, 30 శాతం పెంచడం కుదరదని నిర్మాతలు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో సినీ కార్మికులు నిర్మాతలను వ్యతిరేకంగా సమ్మెకు దిగి షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చాయి. దీంతో నిర్మాతల ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించిన షూటింగ్స్ కొనసాగిస్తున్నాయి. దీంతో సినీ కార్మికులు ఆగ్రహించి షూటింగ్స్ సెట్స్‌కి వెళ్లి వాగ్వాదానికి దిగారు. నిన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో షూటింగ్ని వెళ్లి అక్కడ గొడవకు దిగి షూటింగ్ని అడ్డుకున్నారు.
Also Read: SIIMA 2024 Scam: సైమా స్కాం.. మా అసోసియేషన్‌లో స్టార్ హీరోయిన్ ఫిర్యాదు?