Tollywood Top Heroine Complaint Against SIIMA: సైమా తనని మోసం చేసిందని, న్యాయం జరిపించాలని స్టార్ హీరోయిన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను (MAA) ఆశ్రయించింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. సైమా స్కాం బాధితుల్లో ఈమే మాత్రమే కాదు పలువురు స్టార్హీరోహీరోయిన్లు కూడా ఉన్నారట. దీంతో త్వరలోనే వారు కూడా న్యాయం కోసం మా అసోసియేషన్ని కలవబోతున్నట్టు టాక్. ఇంతకి అసలు సంగతేంటీ? మా వరకు రచ్చకెక్కాడానికి కారణాలేంటో ఇక్కడ చూద్ధాం!
దుబాయ్ లో గ్రాండ్ ఈవెంట్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సైమా (SIIMA Awards) ఒకటి. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో ప్రతి ఏడాది దక్షిణాది చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారిని అవార్డుతో సత్కరిస్తారు. సౌత్ ఇండియాలో ఇచ్చే టాప్ అవార్డుల్లో ఇది ఒకటి. ప్రతి ఏడాదిలాగే గతేడాది ఈ సైమా అవార్డులను దుబాయ్లో గ్రాండ్గా నిర్వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తమదైన నటనతో మెప్పించి ప్రశంసలు అందుకున్న సినీతారలను ఈ అవార్డుతో సత్కరించారు. దుబాయ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సౌత్ స్టార్ పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.
పారితోషికం ఎగ్గొట్టిన సైమా
గతేడాది జరిగిన ఈ ఈవెంట్కి రానా హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పలువురు స్టార్ హీరోహీరోయిన్లు తమ డ్యాన్స్తో అదరగొట్టారు. ఇందుకోసం వారితో రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. అయితే ఈ కార్యక్రమంలో టాప్ హీరోయిన్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు రూ. 50 లక్షల పారితోషికం డిమాండ్ చేయగా.. దీనికి సైమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు సైమా ఆమెకు రూ.30 లక్షలు మాత్రమే ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ రూ. 20 లక్షలు అడిగితా సైమా నిర్వాహకులు మొహం చాటేస్తున్నారట. దీంతో ఆ టాప్ హీరోయిన్ తనకు న్యాయం జరిపించాలని, సైమా నుంచి బ్యాలెన్స్ ఎమౌంట్ ఇప్పించాలని కోరుతూ మా అసోసియేషన్ను ఆశ్రయించింది.
‘మా’లో ఆ హీరోయిన్ ఫిర్యాదు..
సైమాపై మాలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. టాప్ హీరోయిన్ నిర్ణయంతో మిగతా వారు ఆమె బాటలోనే నడబోతున్నారట. గతేడాది ఈ అవార్డుల్లో వేడుకల్లో పాల్గొన్న చాలామంది నటీనటులకు కూడా సైమా రెమ్యునరేషన్ ఎగ్గొట్టిందట. మరి ఇందులో నిజమేంతుందో తెలియదు కానీ, సైమా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇలా నటీనటుల రెమ్యునరేషన్ విషయంలో కక్కుర్తి పండటమేంటని, ఛీ ఛీ ఇదేం పాడు బుద్ది అంటూ ఇండస్ట్రీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాంటే నేరుగా ఈ అవార్డు సంస్థ స్పందించేవరకు వేయిట్ చేయాల్సిందే.