E-Paper
Advertisement

IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్

IndiGo Tickets Refund: రిఫండ్ వెంటనే చెల్లించాలి.. రేపటికల్లా విమానాలు నడకపోతే తీవ్ర చర్యలు.. కేంద్రం వార్నింగ్
Advertisement

IndiGo Tickets Refund: ఇండిగో విమాన అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వందల సంఖ్యలో ఇండిగో సంస్థ విమానాల రద్దు చేసింది. శనివారం కూడా విమానాల రద్దు కొనసాగుతోంది. ఇప్పటికే ఇండిగో తీరుపై దర్యాప్తదు చేపట్టిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

రిఫండ్ పై డెడ్ లైన్

పెండింగ్‌లో ఉన్న ప్రయాణికుల విమాన టికెట్ల రిఫండ్లను ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రద్దు అయిన లేదా అంతరాయం కలిగిన అన్ని విమానాల రిఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7, 2025 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఇండిగోను ఆదేశించారు. రద్దైన విమానాలను రేపటికల్లా తిరిగి షెడ్యూల్ చేయాలని పేర్కొన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రిఫండ్ సెల్ లు ఏర్పాటు

Advertisement

అలాగే ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని విమానయాన సంస్థలకు సూచించారు. ఏదైనా సంస్థ నిబంధనలను పాటించకపోతే నియంత్రణ చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ప్రయాణికుల కోసం రిఫండ్ సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. రిఫండ్ అమౌంట్ వీలైనంత తొందరగా చెల్లించేందుకు ఆటోమేటిక్ రిఫండ్లను సదుపాయం కల్పించాలని ఇండిగో సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించారు.

Also Read: Airplane Catches Fire: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు

48 గంటల్లోపు లగేజీ గుర్తించాలి

Advertisement

48 గంటల్లోపు ప్రయాణికుల లగేజీలను గుర్తించి, వారి ఇంటికి డెలివరీ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన ప్రయాణికులు, అత్యవసర ప్రయాణం అవసరమయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×