E-Paper
Advertisement

Tharun Bhascker: వెంకీ మామతో సినిమా..ఇదే కరెక్ట్ టైం అంటున్న తరుణ్ భాస్కర్!

Tharun Bhascker: వెంకీ మామతో సినిమా..ఇదే కరెక్ట్ టైం అంటున్న తరుణ్ భాస్కర్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన ప్రస్తుతం హీరోగా ఓం శాంతి శాంతి శాంతి(Om Shanthi Shanthi Shanthi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 30 వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తరుణ్ భాస్కర్(Tharun Bhascker)వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తరుణ్ భాస్కర్ కు విక్టరీ వెంకటేష్ తో సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

వెంకటేష్ తో నా సినిమా ఆగిపోలేదు..

తరుణ్ భాస్కర్ దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా తెరపైకి రాలేదు తరుణ్ భాస్కర్ నటుడిగా పలు సినిమాలలో బిజీగా ఉండటం వల్ల వెంకటేష్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది అంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఓం శాంతి శాంతి శాంతి ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ తో సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ తో తాను చేయాలనుకున్న సినిమా ఆగిపోలేదని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.

గుర్రపు పందెం నేపథ్యంలో..

వెంకటేష్ కోసం తాను డెక్కన్ డార్బీ (గుర్రపు పందెం) నేపథ్యంలో కథ సిద్ధం చేసుకున్నానని తెలిపారు. అయితే ఈ కథకు సంబంధించి రెండో భాగంలో కొన్ని చోట్ల నాకు సంతృప్తి ఇవ్వలేదు. అలాగే కనెక్షన్ కూడా ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది. అందుకే ఈ సినిమాని అక్కడితో ఆపి వేశానని తెలిపారు. సమయం దొరికినప్పుడు ఈ స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఇలాంటి గుర్రపు పందెం నేపథ్యంలో వెంకటేష్ తో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం అని తరుణ్ భాస్కర్ తెలిపారు. వెంకటేష్ తో సినిమా ఆగిపోలేదని ఈయన చెప్పడంతో ఎప్పటికైనా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ ఈ కథతో సినిమా చేస్తారని స్పష్టమవుతుంది.

వెంకటేష్ ఆదర్శ కుటుంబం మూవీ…

ఇక వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. గత ఎడారి సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే..ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో వెంకటేష్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తరువాతనే తరుణ్ భాస్కర్ తో ఉండొచ్చని తెలుస్తోంది. ఇక తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే మరోవైపు దర్శకుడిగా ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Mega Twins: మెగా వారసులు వచ్చేస్తున్నారు.. డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన ఉపాసన!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×