BigTV English

Film industry: స్టార్ కటౌట్ కాదు కంటెంట్ ఉండాలి గురూ.. నిరూపిస్తున్న ఆడియన్స్.. దెబ్బకి ఔట్!

Film industry: స్టార్ కటౌట్ కాదు కంటెంట్ ఉండాలి గురూ.. నిరూపిస్తున్న ఆడియన్స్.. దెబ్బకి ఔట్!

Film industry:ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే.. ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే.. ఆ సినిమా హీరో ఎవరు? హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతలు, క్యాస్టింగ్ ఇలా తదితర విషయాలపై ప్రతి ఒక్కరు దృష్టి పెడతారు. అటు స్టార్ హీరో సినిమా అయితే మాత్రం కచ్చితంగా.. ఆ సినిమా కళ్ళు మూసుకొని హిట్ కొట్టేస్తుంది అని ఒకప్పుడు భ్రమలో ఉండేవారు చాలామంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అవతల ఎంత పెద్ద స్టార్ అయినా సరే కంటెంట్ లేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను వారి అభిమానులే సక్సెస్ చేస్తారు అనే మాటలు పాతవి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినా సరే కంటెంట్ లేకపోతే డిజాస్టర్ గా మిగలాల్సిందే అనే రోజులు వచ్చేసాయి.


కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం అంటున్న ఆడియన్స్..

ఉదాహరణకు ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత చేసిన తొలి చిత్రం.. ఊహించని ఎక్స్పెక్టేషన్స్ సినిమాపై ఉన్నా.. కంటెంట్ లేకపోవడం వల్ల పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ హీరో లేకపోయినా కంటెంట్ ఉంటే చాలు యానిమేటెడ్ చిత్రాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి అని నిరూపించింది ‘మహావతార్ నరసింహా’. ఇందులో ఎటువంటి క్యాస్టింగ్ లేదు.. కేవలం కంటెంట్ ను బేస్ చేసుకుని.. 3D యానిమేషన్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.


కథను నమ్ముకుని సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు..

దీనికి తోడు ఇటు తెలుగులో కూడా కంటెంట్ ను బేస్ చేసుకుని వచ్చిన ఎన్నో చిన్న చిత్రాలు కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి అంటే.. ఆడియన్స్ కంటెంట్ కి ఏ రేంజ్ లో ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం అంటూ నిరూపిస్తున్నారు. మరి ఇప్పటివరకు కటౌట్ ని నమ్ముకొని కొన్ని చిత్రాలు.. కంటెంట్ ను నమ్ముకుని మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి.

చిన్న సినిమాగా వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ తోనే ఢీ..

అందులో ప్రత్యేకించి కొన్ని చిత్రాలు కథాబలంతో స్టార్ హీరోల చిత్రాలకి కూడా పోటీగా నిలిచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందులో ‘హనుమాన్’ చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. గతంలో మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ హీరోకి పోటీగా చిన్న హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘హనుమాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ముందు ఈ సినిమా నిలవదని చాలామంది కామెంట్లు చేశారు. కానీ అనూహ్యంగా ‘గుంటూరుకారం’ మూవీ డిజాస్టర్ గా నిలవగా.. ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఊహించని కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. తన కంటెంట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి సినిమానే ఢీకొట్టారు కుర్ర హీరో తేజ సజ్జ.

కంటెంట్ లేకపోవడంతో చతికిల పడ్డ గ్లోబల్ స్టార్..

ఇక తర్వాత ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్నేళ్ళ శ్రమ, దీనికి తోడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director S. Shankar) దర్శకత్వం.. దిల్ రాజు(Dilraju ) నిర్మాణం.. వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ సినిమాను తీశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు ఈ సినిమాకు పోటీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వెంకటేష్ (Venkatesh) తో అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.
ఇందులో కేవలం కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని సింపుల్ సినిమాగా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరి ఇప్పటికైనా స్టార్ హీరోలు కళ్ళు తెరుస్తారా?

ఓవరాల్ గా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే స్టార్ హీరోల పవర్ తగ్గిపోతోంది.. కంటెంట్ పవర్ పెరిగిపోతోంది.అందుకే సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రమే ఊరు, పేరు తెలియని సినిమాను కూడా సూపర్ హిట్ చేసేస్తున్నారు ఆడియన్స్. మరి ఇప్పటికైనా హీరోలు తమ స్టేటస్ పై కాకుండా కంటెంట్ పై దృష్టి పెడితే సక్సెస్ సాధించవచ్చు అని ఆడియన్స్ సలహాలు కూడా ఇస్తున్నారు. లేకపోతే దెబ్బకు బుట్ట సర్దాల్సిందే అని కూడా హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం .

Related News

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర

Vijay Sethupathi -Puri : ఫుల్ స్పీడుమీదున్న  పూరీ.. కొత్త షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కిన టీం

Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు

C Kalyan: నిర్మాత విశ్వప్రసాద్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు – సి కళ్యాణ్

Peddi Movie: పెద్ది కొత్త షెడ్యూల్ ఖరారు.. ఆ దేశానికి పయనమైన టీమ్!

Mrunal Thakur :నాకు అలాంటి డైరెక్టర్ తో పని చేయడం ఇష్టం 

Big Stories

×