BIG Shock To Donald Trump: అయితే బెదిరింపు.. లేదంటే టారిఫ్ బాంబు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇంతకుమించి ఏం ఎక్స్‌పెక్ట్స్ చేసే సిట్యూవేషన్ లేదిప్పుడు. టారిఫ్‌ల విషయంలో లెటెస్ట్‌గా 24 గంటల డెడ్‌లైన్ విధించారు ట్రంప్. మరి ఈ బెదిరింపులు ఎలాంటి ఎఫెక్ట్ చూపుతున్నాయి? ట్రంప్ తన టెంపరితనంతో అమెరికాను చిక్కుల్లో పడేస్తున్నారా? ఈ అణచివేత ధోరణిపై ఇప్పుడు దేశాలు ఏకమవుతున్నాయా? ట్రంప్‌కు సినిమా చూపించేందుకు దేశాలు సిద్ధమవుతున్నాయా?
వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకుంటున్న ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. గతంలో తమ దేశ ఆర్మీని ఉపయోగించి ప్రపంచ దేశాలపై పెత్తనం చేసిన అమెరికా.. ట్రంప్ హయాంలో మాత్రం ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుంటోంది. ట్రంప్ అయితే తమ దారికి రాని దేశాలపై టారిఫ్‌ల అస్త్రం ప్రయోగిస్తూ వస్తున్నారు. భారత్‌పై ఇప్పటికే 25 శాతం టారిఫ్‌లను విధించారు ట్రంప్. ఇప్పుడు వాటిని మరింత పెంచుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల వార్నింగ్‌కు ఓ రీజన్ చెబుతున్నారు. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోళ్లు చేయడం నచ్చడం లేదట.. అలా చేయడం వల్ల.. రష్యాకు ఆర్థికంగా చేయూతనందిస్తుందట.. ఇలా భారత్ ఇచ్చే డబ్బుతో రష్యా ఆయుధాలను తయారు చేసి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తుందట.. ఇవీ ట్రంప్ చెబుతున్న కారణాలు. అందుకే వెంటనే రష్యా నుంచి ఇంధనం కొనుగోళ్లు ఆపాలని సూచిస్తున్నారు. సూచిస్తున్నారు అనేకంటే ఆదేశిస్తున్నారు అనడం కరెక్ట్.
భారత్ ఏం చేయాలో చెప్పేందుకు ట్రంప్ ఎవరు?
ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే.. భారత్ ఏ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేయాలి? ఏ దేశంతో వాణిజ్యం చేయాలి? అని చెప్పేందుకు ట్రంప్ ఎవరు? ఇప్పుడిదే ప్రశ్న తెరపైకి వచ్చింది. అందుకే టారిఫ్‌లు విధిస్తానని ఓ సారి, నేనే భారత్-పాక్ యుద్ధం ఆపానని మరోసారి.. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినా చాలాసార్లు భారత్ సహనంతోనే ఉంది. ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కౌంటర్లు వేయలేదు. ఏ విషయాన్నైనా దౌత్యపరంగానే డీల్ చేసింది. కానీ ఈసారి ట్రంప్ హద్దులు దాటాడు. తన ట్రూత్ సోషల్‌నే వైట్‌హౌస్ అధికారిక చానల్‌గా మార్చుకోని ఇష్టం వచ్చింది పేలుతుండటంతో భారత్ కూడా మౌన ముద్రను వీడింది. అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. అన్ని దేశాలతో మాకు సంబంధం ఉంది.. కానీ రష్యాతో మాత్రం కాలపరీక్షకు నిలిచిన బంధం.. మాకు లెక్చర్లు ఇవ్వొద్దు అంటూ భారత్ కౌంటర్ ఇచ్చింది. నిజానికి అమెరికా భారత్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు. భారత్ రియాక్షన్‌తో ఏం చేసుకుంటారో చేసుకోండి.. మేం మాత్రం కొనుగోళ్లు ఆపమని చెప్పినట్టైంది.
రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేశాయంటూ స్టేట్‌మెంట్
ట్రంప్ తన నోటికి, పోస్టులకు పని పెడుతూ ఓ తప్పుడు ప్రొపగాండాను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. బెదిరింపులు చేసిన తర్వాతి రోజే.. ఇండియన్ కంపెనీలు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేసినట్టు ఉన్నాయంటూ మరో పోస్ట్ పెట్టాడు. అంటే తాను చెప్తే ఇండియా విన్నది అని ప్రపంచానికి చెప్పినట్టు అన్నమాట. మరి దీనికి భారత్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే.. ట్రంప్ వార్నింగ్ తర్వాత 2 కోట్ల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. దీనికంటే పెద్ద ఆన్సర్ ఇంకేముంటుంది. ప్రస్తుతం భారత్ రష్యన్ ఆయిల్‌పై ఎక్కువగా ఆధారపడిందనే చెప్పాలి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 0.2 శాతం ఉన్న దిగుమతులు ఇప్పుడు 35 నుంచి 40 శాతానికి చేరుకున్నాయి. దీని వల్ల ఇంధన ధరల్లో పెరుగుదల లేదు.. దిగుమతులు కూడా భారం కాలేదు. దీని వల్ల భారత ఇంధన కంపెనీలకు ఆదాయం కూడా వచ్చింది. మరి అమెరికా ప్రయోజనాలను అమెరికా చూసుకుంటున్నప్పుడు.. భారత్ కూడా అదే విధానాన్ని ఫాలో అవుతుంటే ట్రంప్‌కు వచ్చిన ఇబ్బందేంటి అనేది ప్రశ్న. ఇక్కడ భారత్ ఎవరిని ధిక్కరించడం లేదు. ఎక్కడా చట్టాలను ఉల్లంఘించడం లేదు. ట్రంప్‌కు నిజంగా రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను ఆపాలని ఉంటే.. యూఎన్ సెక్యూరిటి కౌన్సిల్‌లో ఆంక్షలు విధించాలని ఓ రిజల్యూషన్ తీసుకురావాలి.. దాన్ని ఆమోదింపచేసుకోవాలి.. అప్పుడు ఆటోమెటిక్‌గా ఆంక్షలు వస్తాయి. కానీ ట్రంప్ అలా చేయకుండా భారత్‌ను కావాలనే టార్గెట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఉక్రెయిన్‌కు ఈయూ దేశాలు చేసిన మిలటరీ సాయం 21 బిలియన్ డాలర్లు
ఇక్కడ భారత్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఎందుకు అంటున్నామంటే.. యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాతో ఇప్పటికీ వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2024లో రష్యా నుంచి 24 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నాయి ఈయూ దేశాలు. నెంబర్ మరోసారి వినండి.. 25 బిలియన్ డాలర్లు. అదే సమయంలో ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు చేసిన మిలటరీ సాయం 21 బిలియన్ డాలర్లు. అంటే ఉక్రెయిన్‌కు చేసిన సాయం కంటే.. రష్యాకు చెల్లించిన డబ్బే ఎక్కువ. ఇక్కడ మరో గమ్మతైన విషయం ఏంటంటే.. ఇందులో కొంత చమురును ఉక్రెయిన్ మీదుగానే సరఫరా చేసింది రష్యా. ఇందుకుగాను.. 800 మిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్లను వసూలు చేసింది ఉక్రెయిన్. ఈయూ దేశాలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు ట్రంప్. కేవలం భారత్‌ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ట్రంప్‌కు కనిపించడం లేదా? లేక కనిపించినా కళ్లు మూసుకుంటున్నారా?
భారత్-అమెరికా మధ్య 86 డాలర్ల విలవైన వాణిజ్యం
అందుకే భారత్ స్వరం మారుతోంది.. ఇకపై తీరు కూడా మారుతోంది. దారికి వస్తే ఓకే.. లేదంటే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్లు వేయడం ప్రారంభించింది. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌కు ఆయుధాలు అమ్మింది అమెరికా కాదా? అంటూ నేరుగా ప్రశ్నించింది. ఆ సమయంలో 2 బిలియన్ డాలర్ల ఆయుధాలను అందించలేదా? అంటూ ఆధారాలతో ప్రశ్నించింది. కానీ భారత్ రష్యాకు ఏమైనా ఆయుధాలు అందించిందా? లేదు కదా. కేవలం అవసరమైన ఇంధనం మాత్రమే కొనుగోలు చేస్తోంది. ప్రతి ఏటా భారత్-అమెరికా మధ్య 86 డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లు 40 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై పడుతుంది. తమకు అవసరమైన మిగిలిన 44 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల జోలికి వెళ్లలేదు అమెరికా. ఇప్పుడు ట్రంప్ ఇలానే తోక జాడిస్తే.. పడిన టారిఫ్ భారాన్ని ఇతర ఎగుమతులపై ఎలా విధించాలన్న దానిపై ఫోకస్ చేస్తోంది. అదే జరిగితే ట్రేడ్ వార్ ప్రారంభమైనట్టే. మొత్తానికి ట్రంప్ పుణ్యమా అని ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అమెరికా, భారత్ బంధానికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. ఇదే విధానం కొనసాగితే.. అది భారత్‌కు కాస్త నష్టమే అయినా.. అమెరికాకే మరింత చేటు చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ట్రంప్ ఇప్పుడు కేవలం ఇండియాతో మాత్రమే కాదు.. మొత్తం అన్ని దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ట్రంప్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అమెరికా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? దీనికి ట్రంప్ చేస్తున్న పనులు ఎలా కారణమవుతున్నాయి?
అమెరికాను ప్రపంచ దేశాలకు దూరం చేస్తున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ధీక్కార స్వరం పెరుగుతోంది. నిజానికి అమెరికాను ప్రపంచ దేశాలకు ఓ విలన్‌గా చేసేశారు ట్రంప్. టారిఫ్‌లు విధించడం ఒక ఎత్తు అయితే.. ఆయన నోటితో చేస్తున్న బెదిరింపు ధోరణి.. సోషల్ మీడియాలో చేస్తున్న అడ్డదిడ్డమైన పోస్టులు ఇప్పుడు అమెరికాను ప్రపంచ దేశాలకు దూరం జరిగేలా చేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అస్మదీయులు, తస్మదీయులు అనే బేధం లేకుండా ఎవరిని వదలకుండా బెదిరిస్తూనే ఉన్నారు. ఆయన తొందరపాటు విధానాలతో మిత్ర దేశాలను దూరం చేసుకోవడమో.. అనుమానాలు పెంచేలా చేయడమో చేస్తున్నారు. కెనడా, మెక్సికో, ఈయూ దేశాలు, యూకే ఆఖరికి ఉక్రెయిన్‌పై కూడా బహిరంగంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, గిల్లిగజ్జాలు పెట్టుకోవడం ఆయనకే చెల్లింది. ఇక రష్యా, చైనా, భారత్ గురించి అయితే సరేసరి.
ఫలితం ఇవ్వని ట్రంప్ విధానాలు
ప్రస్తుతం ట్రంప్‌లో ఓ ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. అధికారంలోకి రాగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేస్తానన్నారు. రష్యాతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పైనే ఆరోపణలు చేశారు. కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరువు పోయినంత పనైందన్న ఆలోచన ట్రంప్‌ది. అందుకే ప్రపంచంలో ఎక్కడా వివాదాలు నెలకొన్నా.. అందులో పిలవని పెరంటానికి వెళ్లినట్టు అందులో జోక్యం చేసుకోవడం.. తానే వివాదాన్ని ఆపానని పదే పదే చెప్పడం అలవాటుగా మారింది. భారత్-పాక్ ఘర్షణను ఆపింది.. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపింది మరేవరో కాదు.. తానే అని చెబుతున్నారు ట్రంప్. కానీ అసలు నిజం వేరు అనేది ప్రపంచం మొత్తానికి ఇప్పటికే అర్థమైంది. దీంతో పరువు పోతుంది. ఇక ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి.
డెడ్ హ్యాండ్ సిస్టమ్ గురించి మెద్వదేవ్ ప్రస్తావన
రష్యా విషయంలో భారత్‌ను ఎలాగైతే బెదిరించారో.. చైనాను కూడా అలానే బెదిరించారు ట్రంప్. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది. తమ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. రష్యా అయితే ఎప్పటికప్పుడు ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూనే ఉంది. రష్యాది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ ఎగతాళి చేయగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ డెడ్ లాక్ హ్యాండ్ సిస్టమ్ గురించి ప్రస్తావించారు. దీంతో రష్యా తీరంలో రెండు న్యూక్లియర్ సబ్ మెరైన్‌లను మోహరిస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు చేసింది ఓ మాజీ అధ్యక్షుడు.. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకొని ఏకంగా న్యూక్లియర్ సబ్‌మెరైన్లను మోహరిస్తున్నట్టు ప్రకటించారు. దీనిని బట్టే అర్థమవుతోంది ట్రంప్ ఎంత టెంపరితనంగా ఆలోచిస్తారో.
వ్యూహాత్మక ప్రదేశాల్లో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు
నిజానికి న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల విషయం వేరే. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ పాలసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యూహాత్మక ప్రదేశాల్లో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు ఎప్పుడూ మోహరించి ఉంటాయి. కానీ ట్రంప్ ఇలాంటి ప్రకటన చేసి.. రష్యాకు వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. దీని వల్ల ఏమైంది.. రష్యా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, రష్యా మధ్య ఉన్న ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ నుంచి బయటికి వచ్చింది. ఇప్పుడు కొన్ని రకాల అత్యాధునిక, అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరిస్తోంది రష్యా. అంటే అమెరికన్ సబ్ మెరెన్‌లు ఏమైనా దాడులు చేస్తే రష్యా కౌంటర్ చేస్తోంది. దీనంతటికి కారణం ట్రంప్. 2019లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం నుంచి అమెరికా బయటికి తీసుకొచ్చారు ట్రంప్. ఇప్పుడు రష్యాను కూడా బయటికి వచ్చేలా చేశారు. దీని వల్ల అమెరికాకు నయా పైసా నష్టం లేదు. కానీ యూరోపియన్ దేశాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడిపాల్సిన పరిస్థితి. ఇంతా చేసి మళ్లీ నోబెల్ శాంతి బహుమతి తనకే కావాలంటారు ట్రంప్.
గతంలో ఇరాన్ నుంచి తక్కవ ధరకే చమురు దిగుమతి
ఇక బ్రిక్స్ దేశాలపై ఏమాత్రం బెదిరింపులను ఆపడం లేదు ట్రంప్. ఈ బెదిరింపులకు బెదరడం అటుంచి.. అమెరికాకు వ్యతిరేకంగా ఏకమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో ఇరాన్ నుంచి మనకు తక్కువ ధరకే చమురు దిగుమతి అయ్యేది. అప్పుడు చమురును రూపాయల్లో చెల్లించి దిగుమతి చేసుకునేది భారత్. కానీ ఆ దేశంపై సొంత కారణాలతో అనేక ఆంక్షలు విధించి మనల్ని చమురు దిగుమతి చేసుకోకుండా చేసింది అమెరికా. దీని వల్ల బహిరంగ మార్కెట్లో డాలర్లలో అధిక ధరకు కొనుగోలు చేశాం. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. కానీ ఈసారి భారత్ ఆ తప్పును రిపీట్ చేసే ఉద్దేశంలో లేదు.
Also Read: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..
దేనికైనా రెడీ అంటున్న భారత్..
రష్యా సై అంటే సై అంటోంది.. చైనా తగ్గేదేలే అంటోంది.. భారత్ కూడా దేనికైనా రెడీ అని చెబుతోంది. జనాభా విషయంలో చూసుకున్నా.. ఆర్థిక వ్యవస్థల విషయంలో తీసుకున్నా.. జీడీపీ విషయంలో తీసుకున్నా.. చైనా, భారత్‌ను ఏ దేశం పక్కన పెట్టలేని పరిస్థితి. కానీ ట్రంప్ మాత్రం ఈ రెండు దేశాలను తన దారికి తెచ్చుకునేందుకు అడ్డమైన దారుల్లో పయనిస్తున్నారు. దీనికి రష్యా, ఇరాన్ అంటూ సాకులు చూపుతున్నారు. భారత్‌కు నచ్చదని తెలిసి కూడా పాక్‌తో అంటకాగుతున్నారు ట్రంప్. సో.. ఇప్పటి వరకు మీరు దారికి రాకపోతే మేం చేయగలమో ట్రంప్ చూపించారు. ఇక ఇప్పుడు భారత్ వంతు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో.. ఇకనైనా అమెరికా ఇకనైనా ఆగకపోతే.. రాబోయే కాలంలో మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయం. ఇప్పటికే పెద్దన్నపాత్రపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇకపై నమ్మకాన్ని కోల్పోతే ఇక అంతే సంగతులు.
Story By Vamshi Krishna, Bigtv