E-Paper
Advertisement

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలం చెరువు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చిన తొమ్మిది మంది కార్మికులు చెరువు మధ్యలో చిక్కుకుపోవడంతో కలకలం రేగింది. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరంతా గల్లంతయ్యారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన సుమారు తొమ్మిది మంది కార్మికులు మీరాలం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చెరువులోకి వెళ్తుంటారు. యథావిధిగా ఆదివారం ఉదయం పనులకు వెళ్లిన వీరు.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి గట్టుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే.. వారు ప్రయాణిస్తున్న బోటులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో అది నీటి మధ్యలో నిలిచిపోయింది. చీకటి పడటం, గాలి వేగం పెరగడంతో కార్మికులు నీటిలో గల్లంతయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), స్థానిక పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ.. రెస్క్యూ టీమ్స్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. గల్లంతైన తొమ్మిది మంది కార్మికులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరికి ప్రాథమిక చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×