BigTV English
Advertisement

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

OG Film: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే వెంటనే ఆ సినిమాని సోషల్ మీడియాలో లీక్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఎంతోమంది కష్టపడి కొన్ని సంవత్సరాలపాటు ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే గంటల వ్యవధిలోని హెచ్డి ప్రింట్ తో చేస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి అడ్డుకట్టు వేయడం కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమాలు విడుదలైన మొదటి రోజే పైరసీకి(Piracy) గురి అవుతున్నాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాకి కూడా ఈ పైరసీ తిప్పలు తప్ప లేదనే చెప్పాలి.


హెచ్డీ ప్రింట్ లీక్…

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా(OG Movie) ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇక చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా అభిమానులు చిత్ర బృందం సంతోషం వ్యక్తపరిచేలోపే ఈ సినిమా హెచ్డి ప్రింట్(HD Print) తో లీక్ అవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే హెచ్డీ ప్రింట్ బయటకు వచ్చింది.

పవన్ సినిమాకు తప్పని పైరసీ..

ఈ సినిమా టెలిగ్రామ్, పలు పాపులర్ వెబ్ సైట్లలో ఫుల్ హెచ్డి ప్రింట్ అందుబాటులోకి వచ్చిందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని సంబరపడేలోపు ఇలా లీక్ అవ్వడంతో కచ్చితంగా సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.ఇలా సినిమాను మొదటి రోజే లీక్ చేస్తున్న వెబ్సైట్లపై చర్యలు తీసుకొని పైరసీకి అడ్డుకట్టు వేయాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. పైరసీ అనేది ఇండస్ట్రీలో పెనుభూతం లాగా విహరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లో విడుదల అవ్వడమే ఆలస్యం ఏకంగా ఆర్టిసి బస్సులలో కూడా సినిమాలు ప్రసారం అవ్వటం గమనార్హం.


భారీ స్థాయిలో ఓపెనింగ్స్…

ఇక పవన్ కళ్యాణ్ సినిమా కూడా పైరసీ బారిన పడటంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఓ వర్గం వారికి ఏమాత్రం నచ్చదని ఇలా సినిమా పైరసీ వెనుక వారి హస్తము ఉంటుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిందని సమాచారం. ఈ సినిమా విషయంలో ఎప్పుడు లేని విధంగా ప్రీమియర్లకు కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగిన సంగతి తెలిసిందే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు ఊహించని ఆదరణ లభిస్తుంది.

Also Read: Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Related News

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Sandeep Kishan : సందీప్‌తో విజయ్ కొడుకు కొత్త మూవీ… టైటిల్ పోస్టర్ వచ్చేసింది..

The Rajasaab: సంక్రాంతి అన్నారు.. సడీ లేదు.. చప్పుడు లేదు.. అసలు సినిమా వస్తుందా ?

RT76: భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ.. ఎన్ని కోట్లంటే..?

Chiranjeevi: చిరుతో సినిమా.. చెప్పాపెట్టకుండా పారిపోయిన వర్మ.. అసలేం జరిగింది..?

Imanvi : ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్.. ఆ హీరోయిన్స్ జాబితాలో ఇమాన్వి!

SSMB 29 Update: జక్కన్న నుంచి మరో సర్ప్రైజ్… హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

Big Stories

×