Irumudi Movie: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (raviteja )నటించిన ‘ఇరుముడి’ సినిమా వ్యవహారం టాలీవుడ్‌లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది. సినిమాలో ఒక మైనర్ బాలిక తో షూటింగ్ నిర్వహించడం, చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంపై తెలంగాణ కార్మిక శాఖ రంగంలోకి దిగి నిర్మాతలకు షాకింగ్ నోటీసులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం’ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ చర్యలు తీసుకున్నారని, బాలికను సినిమా షూటింగ్‌లో భాగం చేయడానికి ముందస్తుగా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా లేదా? అలాగే బాలిక తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అనే విషయాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారట.
కేవలం అనుమతులతోనే సరిపెట్టకుండా బాల కార్మిక చట్టాల అమలుపై లేబర్ డిపార్ట్‌మెంట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించిందట. షూటింగ్ కారణంగా ఆ చిన్నారి చదువుకు ఆటంకం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా? అనే వివరాలను కూడా స్పష్టం చేయాలని పేర్కొన్నట్లు సమాచారం.
బాలల హక్కుల పరిరక్షణ నిబంధనల ప్రకారం మైనర్ బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? లేదా? అని అధికారులు ప్రశ్నించారట అంతేకాకుండా, కేవలం షూటింగ్‌కే కాకుండా ‘ఇరుముడి’ ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రీ-రిలీజ్ వేడుకల్లో బాలికను పాల్గొనేలా చేయడంపై వివరణ కోరారు. ఆ ఈవెంట్లలో నిబంధనలు పాటించారా లేదా అని తేల్చాలని ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ సమన్లు జారీ చేసింది. గత ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి, ఆ విజయానంతరం బాల కార్మిక చట్టాల రూపంలో నోటీసులు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.
also read: బిగ్ బాస్ 10పై ‘స్నో అక్క ‘ ఊహించని కామెంట్స్.. ఇంట్రెస్ట్ కాస్త భయంగా మారిందంటూ!
ఇక మొత్తానికి చూస్తే, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులను నటించేలా చేసే క్రమంలో నియమ నిబంధనలు ఎంత పక్కాగా పాటించాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. లేబర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఈ నోటీసులపై నవంబర్ 4న జరగబోయే విచారణలో ‘ఇరుముడి’ నిర్మాతలు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇకపోతే కార్మిక శాఖ బాలిక పేరు ప్రస్తావించలేదు కానీ ఇందులో ప్రధానంగా నటించిన బేబీ నక్షత్ర(Baby Nakshatra) గురించి ఈ నోటీసులు అంది ఉండవచ్చు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.