E-Paper
Advertisement

కావ్య అనిరుద్ పెళ్ళి వేడుకలు షూరూ.. డోలక్ పై డాన్సులతో రచ్చ రచ్చ!

కావ్య అనిరుద్ పెళ్ళి వేడుకలు షూరూ.. డోలక్ పై డాన్సులతో రచ్చ రచ్చ!
Advertisement

Anirudh -Kavya Maran Wedding: సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)కావ్య మారన్ (Kavya Maran)పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి కానీ ఈ జంట మాత్రం ఎక్కడ స్పందించలేదు. అయితే ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. నవంబర్10, 11వ తేదీలలో అనిరుద్ కావ్యాల వెడ్డింగ్ ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది.

అనిరుద్ ఇంటపెళ్లి వేడుకలు..

ఇకపోతే వీరి వివాహం కేవలం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుంది. కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో నవంబర్ 21వ తేదీ చాలా ఘనంగా జరగబోతుందని ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లికి పెద్దగా సమయం లేకపోవడంతో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిరుద్ ఇంట పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా అనిరుద్ తన పెళ్లి వేడుకలను ఎంతో సంతోషంగా ప్రారంభించారని తెలుస్తోంది.

గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్..

Advertisement

పెళ్లి సంబరాల్లో భాగంగా అనిరుధ్ డోలక్‌పై కూర్చొని నవ్వుతూ, ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు ముందుగానే కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అనిరుద్ ఇంటిలో వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి కానీ కావ్య ఇంట్లో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా వెలబడలేదు. వీరి వివాహం నవంబర్ 10, 11వ తేదీలలో గ్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సన్నిహితుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు.

ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ ఏకైక హీరో..

ఇక నవంబర్ 21వ తేదీ చెన్నైలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకలో భాగంగా రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కళానిధి మారన్ దంపతులు ప్రముఖులను కలిసి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు ఎవరికి పెద్దగా ఆహ్వానాలు అందలేదని కేవలం అల్లు అర్జున్(Allu Arjun) కు మాత్రమే వీరి వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం కళానిధి మారన్ నిర్మాణంలో రాకా సినిమా చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కు మాత్రమే ఈ ఇన్విటేషన్ అందినట్టు సమాచారం.

Advertisement

Also Read: రితికా సింగ్ పేరుతో భారీ మోసం.. నెలకు రూ.400 సబ్స్క్రిప్షన్ తో భారీ దోపిడి!

Related News

విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?

ముసాఫిర్ డైరెక్టర్ సంజయ్ గుప్తా మృతి..ఏం జరిగిందంటే?

సీనియర్ హీరోకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్నా!

నటుడు సునీల్ రెడ్డి ఎవరి కుమారుడో తెలుసా..?

సాహో బ్యూటీ సరికొత్త అవతారం.. ఈసారి గట్టిగానే కొట్టేలా ఉందిగా!

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?

రితికా సింగ్ పేరుతో భారీ మోసం.. నెలకు రూ.400 సబ్స్క్రిప్షన్ తో భారీ దోపిడి!

Big Stories

Advertisement
×