Prakash Raj: ప్రకాష్ రాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలలో నటుడిగా ఎన్నో అద్భుతమైన, విలక్షణమైన పాత్రలలో నటిస్తూ నటుడిగా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఒక విలన్ పాత్రలో చేసినా, ఒక తండ్రిగా చేసినా, ఒక తాతయ్య పాత్రలో చేసిన ప్రకాష్ రాజ్(Prakash Raj) తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా హీరోగా విలన్ గా తండ్రి తాత పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఈయన సినిమాలలో నటించకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఆయన భార్య పోనీ వర్మ(Pony Varma) తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోనీ వర్మ ప్రకాష్ రాజ్ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాలను తెలిపారు. ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిత్యం వివాదాలలో నిలుస్తూ ఉన్నారు. అయితే ఆయన మొదట్లో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసిందని తెలిపారు.జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఘటన ప్రకాశ్‌రాజ్‌ను మానసికంగా తీవ్రంగా కలిసి వేయడంతో ఇలా భయపడుతూ బ్రతకడం ఎందుకు అంటూ తనని తాను ప్రశ్నించుకున్నారని అప్పటినుంచి ఈయన సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ రాజకీయాల గురించి మాట్లాడటం ప్రశ్నించడం మొదలు పెట్టారని తెలిపారు.
ఇలా ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నారో ఆ క్షణం నుంచి ఆయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. కొంతమంది దర్శకులు తమ సినిమాలలో నటించాలని ఆయనకు అడ్వాన్సులు ఇచ్చినప్పటికీ కూడా ఉన్నఫలంగా ఆ సినిమాల నుంచి తప్పిస్తున్నారు. ఇలా కేవలం సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేసే అవకాశాలు రావటం లేదని పోనీ వర్మ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇలా తనకు అవకాశాలు రాకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైన ఆయన నమ్మిన సిద్ధాంతాల విషయంలో వెనకడుగు వేయరని, తనకి తప్పుగా అనిపించిన దానిని ఎప్పటికీ అంగీకరించకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నారంటూ పోనీ వర్మ తెలిపారు. గత కొంతకాలంగా ఈయన నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ విమర్శలు చేయడం, ఏపీ రాజకీయాలలో భాగంగా సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేయడంతో ఇవి కాస్త వివాదాలకు కారణమయ్యాయి. ఇలా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడంతో పలు టాలీవుడ్ సినిమాలలో కూడా ఈయన అవకాశాలను కోల్పోయారనే విషయం తెలిసిందే.
Also Read: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?