E-Paper
Advertisement

తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!

తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!
Advertisement

Senior Resident: రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ (ఎస్ ఆర్) పోస్టింగ్‌లు, బదిలీల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. 2026 సీనియర్ రెసిడెన్సీ బ్యాచ్ పోస్టింగ్‌లను కేవలం మెరిట్ ప్రాతిపదికన, అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే ‘మాడిఫికేషన్ల’కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ కొందరు డాక్టర్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి ఫిర్యాదు చేశారు. సీనియర్ రెడిడెంట్ లలోని కొందరు డాక్టర్లు నేరుగా డీఎంఈకి రాతపూర్వక వినతిపత్రం అందజేయడంతో వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పారదర్శకతను కాపాడటానికి మెరిట్ జాబితాతో పాటు ప్రతి అభ్యర్థికి కేటాయించిన కాలేజీ వివరాలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

థియరీ మార్కుల ఆధారంగానే మెరిట్..

ప్రాక్టికల్ పరీక్షల మార్కుల కేటాయింపులో అక్రమాలు, పక్షపాతం జరిగే అవకాశం ఉందని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017, 2018 నియామక ప్రక్రియల్లో అమలు చేసినట్లే.. 2026 ఎస్‌ఆర్ బ్యాచ్‌కు కూడా కేవలం ‘థియరీ’ మార్కులను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని మెరిట్ జాబితా రూపొందించాలని కోరారు. ప్రాక్టికల్ మార్కుల వ్యత్యాసాల వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఇక గతంలో 2021, 2022 బ్యాచ్‌లకు సంబంధించి మెరిట్ జాబితాలతో పాటు పోస్టింగ్ కేటాయింపులను అధికారికంగా ఆన్‌లైన్‌లో పిడిఎఫ్ రూపంలో ప్రచురించారని ఎస్‌ఆర్ డాక్టర్లు గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన రెండేళ్లలో ఈ సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడం వల్లే పోస్టింగ్‌ల కేటాయింపులు, వెనుక నుంచి జరిగిన మార్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతీ అభ్యర్థి పోస్టింగ్ డేటాను ఆన్‌లైన్ లో ప్రచురిస్తే,మొదట కేటాయించిన చోట చేరకుండా ఇతర కాలేజీలకు మారిన వారిని సులభంగా గుర్తించవచ్చని, ఇది అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు.

2025 ఎస్‌ఆర్ బ్యాచ్ బదిలీలపై విచారణ?

Advertisement

గతంలో పనిచేసిన అకడమిక్ డీఎంఈ పదవీ విరమణ చేయడానికి కొద్దిరోజుల ముందు 2025 ఎస్‌ఆర్ బ్యాచ్‌ బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ, పెరిఫెరల్ ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఆర్‌లను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు బదిలీ చేశారని డాక్టర్లు ఆరోపించారు.ఈ అర్ధరహిత బదిలీల వెనుక ఉన్న పరిపాలనా అవసరాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర ఎంక్వైరీ (విచారణ) జరిపించాలని కోరారు.పెరిఫెరల్ కాలేజీల నుంచి ఎస్‌ఆర్‌లను నగరాలకు తరలించడం వల్ల పల్లెల్లో వైద్య సేవలు దెబ్బతింటున్నాయని, ఇది ఆరోగ్య శాఖ మంత్రి ఆశయాలకు విరుద్ధమని తెలిపారు.ఈ బదిలీల వ్యవహారంపై డీఎంఈ ఆఫీస్‌లో విచారణ వేగవంతం కానుండటంతో, తప్పుడు మార్గాల్లో బదిలీలు పొందిన వారిలో ఆందోళన మొదలైంది. తక్షణమే నిష్పక్షపాత సమీక్ష జరిపి, అర్హులైన మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని 2026 ఎస్‌ఆర్ బ్యాచ్ ప్రతినిధులు కోరారు.

Also Read: బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

Tags

Related News

రావల్‌కోల్‌లో వీధి కుక్కల బీభత్సం.. 10 గొర్రెలు మృతి, రూ. 2 లక్షల నష్టం!

ర్యాపిడోలో బంగారం పార్సిల్.. చేతివాటం చూపించిన డెలివరీ బాయ్!

సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

కాంగ్రెస్ డ్రామాలను సహించేదే లేదు.. ఇండీ కూటమిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు

ఫాక్స్ సాగర్ చెరువు గురించి మీకు తెలియని 129 ఏళ్ల నిజాలు.. త్వరలోనే మినీ ట్యాంక్‌బండ్‌గా!

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

Big Stories

Advertisement
×