AP Weather: నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఎర్పడనుంది. దీంతో రానున్న 24 గంటల్లో భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ తెలిపారు. దీంతో ఏపీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పోర్టులకు 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో వచ్చే నెల 2వ తేదిన తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని దీంతో మచిలీపట్నంకి ఆగ్నేయంగా 1200 కిమీ దూరంలో వాయుగుండం ఎర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ వాయుగుండం కారణంగా ఏపీకి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మోస్తారు వానలు ఉండే అవకాశం ఉందని రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాల కారణంగా మత్సకారులెవరు చేపలు పట్టడానికి వెల్లోద్దని అధికారులు తెలిపారు. సాయం కాలం సమయంలో మరియు భారీ వర్షం సమయంలో ప్రజలెవరు బైటికి రావద్దని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటికే ఆర్నాబ్ తుఫాన్ కారణంగా భారీగా ఆస్థి, ప్రాణ నష్టం జరిగిన విషయం మనందరికి తెలిసిన విషయమే..
Also Read: తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!