Sanjay Gupta:అక్టోబర్ నెల సినీ సెలబ్రిటీలకు కలిసి రాలేదా అనే మాట వరుస మరణాలను చూస్తుంటే వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంటే.. ఇప్పుడు మరో డైరెక్టర్ మృతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక ఈ వరుస మరణాలు చూస్తుంటే అసలు ఈ ఏడాది అక్టోబర్ నెల ఇండస్ట్రీకి కలిసి రాలేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవా, నేపథ్య గాయకుడు కృష్ణ రాజ్ రామస్వామి, దేవా సోదరుడి కొడుకు కార్తీక్ సభేష్, ప్రముఖ కోలీవుడ్ సీనియర్ నటీమణి వత్సల రాజగోపాల్ ఇలా పలువురు కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మృతి చెందిన విషయం అభిమానులను మరింత దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ తుది శ్వాస విడిచారు. అసలు ఆయన ఎవరు? ఏం జరిగింది? ఆయన మృతికి గల కారణాలేంటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయన ఎవరో కాదు ముసాఫర్ డైరెక్టర్ సంజయ్ గుప్తా(Sanjay Gupta). ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ గా ,నిర్మాత గా పేరు తెచ్చుకున్న సంజయ్ గుప్తా కన్నుమూశారు. 57 సంవత్సరాల వయసున్న సంజయ్ గుప్తా ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడానికి గల కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే.. ముంబైలోని తన నివాసంలో ఆయన కాలు జారి పడటంతో తలకు తీవ్రంగా గాయమై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ సంజయ్ గుప్తా మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నారు.
also read:సీనియర్ హీరోకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్నా!
సంజయ్ గుప్తా మరణానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. ఫిలిం వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రకారం అక్టోబర్ 30న ఆయన తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం సమయంలో సుమారు రెండున్నర గంటలకు వంట గదిలో జారి పడిపోవడంతో తలకు గాయమైందట. ఆయన భార్య, ఇద్దరు కుమారులు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే మొదట్లో ఏం జరిగిందో ఎవరు గ్రహించలేదు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాకపోవడం గమనార్హం.
సంజయ్ గుప్తా నటుడు సంజయ్ దత్ తో కలసి పనిచేసిన కాంటే (2002), ముసాఫిర్ (2004), జిందా (2006), షూట్ అవుట్ అట్ లోఖండ్ వాలా(2007) వంటి చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 1991లో లోకండ్వాలా కాంప్లెక్స్ కాల్పుల ఘటన ఆధారంగా తెరకెక్కించారు. దీనికి సంజయ్ గుప్తా దర్శకుడిగా, నిర్మాతగా, సహా రచయితగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన నిజజీవిత సంఘటన నుండి ప్రేరణ పొందిన మరో చిత్రం షూట్ అవుట్ ఎట్ వాడాలా అనే చిత్రం క్రైమ్ జోనర్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే 2015లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన జజ్బా తో పాటూ కాబిల్ వంటి ప్రాజెక్టులకు కూడా దర్శకత్వం వహించారు.