E-Paper
Advertisement

బిగ్ బాస్ 10పై ‘స్నో అక్క ‘ ఊహించని కామెంట్స్.. ఇంట్రెస్ట్ కాస్త భయంగా మారిందంటూ!

బిగ్ బాస్ 10పై ‘స్నో అక్క ‘ ఊహించని కామెంట్స్.. ఇంట్రెస్ట్ కాస్త భయంగా మారిందంటూ!
Advertisement

Mouneesha Chowdary:సోషల్ మీడియాలో ‘స్నో అక్క’ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మౌనీషా చౌదరి(Mouneesha chowdary). హైదరాబాద్ కి చెందిన ఈమె పెళ్లి తర్వాత అమెరికాలోని ఉటా అనే ప్రాంతంలో స్థిరపడింది. అక్కడే ఐటి జాబ్ చేస్తూ మోడలింగ్ , యాక్టింగ్, బిజినెస్, కంటెంట్ క్రియేటర్ గా కూడా రాణిస్తోంది. దాదాపు 8 ఏళ్లకు పైగా అమెరికన్ బ్రాండ్లకు మోడల్ గా పనిచేసిన ఈమె.. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేయడమే కాకుండా విదేశాలలో బిల్ బోర్డ్స్ పై కూడా కనిపించి మరింత ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు 2016లో మిస్ ఉటా కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. అలాంటి ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెడుతోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి.

బిగ్ బాస్ 10 పై స్నో అక్క రియాక్షన్..

అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌనిషా చౌదరి గతంలో తనకు మూడు నాలుగు సార్లు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, కానీ రిజెక్ట్ చేశానని, అయితే నెక్స్ట్ సీజన్లో వెళ్లాలని అనుకున్నప్పటికీ.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 చూసిన తర్వాత అతను తన అభిప్రాయాన్ని మార్చుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ ఆఫర్ రాలేదా అని ప్రశ్నించగా ..”మూడు, నాలుగు సార్లు బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ నాకు టైం కుదరక నేను ఒప్పుకోలేదు. అయితే ఈ ఏడాది ది ట్రేటర్స్ చేస్తున్నాను. కాబట్టి నా సమయం అంతా ఇక్కడే సరిపోతోంది. అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్లాలని ఉంది.

అసలు అవసరమా అనిపిస్తోంది..

Advertisement

కానీ ఈ సీజన్ చూశాక అలా అరుచుకోవడం , గొడవ పెట్టుకోవడం మన వల్ల కాదులే అనిపిస్తోంది. మొన్నటి వరకు నాకు బాగా కాన్ఫిడెంట్ ఉండేది. గేమ్స్ ఆడి బ్రతికేద్దాం అనుకున్నాను. కానీ ఈ సీజన్ చూశాక ఈ అరుపులు, గొడవలు, కొట్లాటలు అన్ని చూశాక.. నావల్ల అయ్యే పనులు కాదనిపించింది అంటూ బిగ్ బాస్ సీజన్ 10 లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని , అందుకే తనకు ఒకప్పటి వరకు బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆసక్తి ఉన్నప్పటికీ వీటి కారణంగా భయం వేస్తోంది అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేసింది మౌనీషా చౌదరి. మరి చూద్దాం భవిష్యత్తులో ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందో లేదో..

స్నో అక్క కెరియర్..

ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే.. చదువుకుంది మొత్తం ఇక్కడే.. కానీ పదేళ్ల క్రితమే అమెరికా వెళ్ళిపోయాను. అయితే అక్కడ ఒకసారి స్నో పడడంతో ఇక్కడ స్నో అక్క వైరల్ అయిపోయింది అంటూ తనను తాను సరదాగా ఇంట్రడ్యూస్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె అమెరికాలోని మంచు కురిసే వీధుల్లో ఉంటూ తనదైన హ్యూమర్ తో రీల్స్ చేయడం మొదలుపెట్టి.. డల్లాస్ వీధుల్లో తనదైన వ్యాఖ్యలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ మాత్రమే కాదు క్యాన్సర్ అవగాహన, మానసిక ఆరోగ్యం, ప్రసవానంతరం ఎదురయ్యే సవాళ్లపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ ఉంటుంది.

Advertisement

also read:ముసాఫిర్ డైరెక్టర్ సంజయ్ గుప్తా మృతి..ఏం జరిగిందంటే?

ది ట్రేటర్స్ లో కంటెస్టెంట్ గా..

మొత్తానికైతే స్నో అక్కగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఇప్పుడు తేజా సజ్జ హోస్ట్ గా చేస్తున్న ది ట్రేటర్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూతురి అన్నప్రాసన వేడుక..ఫోటోలు వైరల్!

బిగ్ బాస్ హౌస్ లో సడన్ ఎలిమినేషన్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?

Intinti Ramayanam Shriya : పాప చాలా హాటు గురు..ఇది అస్సలు ఊహించలేదు భయ్యా..

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam Today Episode: లాయర్ తో పల్లవి అబద్దం చెప్పిందా..? శ్రీకర్ ప్లాన్ ఫెయిల్.. కమల్ లవ్ ట్రాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         

Big Stories

Advertisement
×