Thamannaah Bhatia:ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తమన్నా (Tamannaah Bhatia)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా వరుస అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూపోయే తమన్నా.. ఏడాది తర్వాత తనపై కామెంట్లు చేసిన ఒక స్టార్ నటుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుకపూర్ (Annu Kapoor) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్న అందం, ఆమె శరీరాకృతిని ఉద్దేశించి కొన్ని అసంబద్ధమైన, చులకన చేసేలా మాట్లాడారు.ముఖ్యంగా ఆమెది పాల లాంటి శరీరం అంటూ వ్యాఖ్యలు చేయగా అప్పట్లో ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ దుమారం రేపాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఈమె.. తాజాగా ఏడాది తర్వాత ఒక మీడియా సమావేశంలో ఈ వివాదం పై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. మహిళల శరీరంపై ఇతరులు ఇలా పబ్లిక్ గా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం.. తోటి నటుల నుంచి ఇలాంటి కామెంట్లు రావడం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇతరుల ప్రైవసీని, గౌరవాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలి అంటూ ఆమె హితవు పలికారు.
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి నెగటివ్ కామెంట్లపై నేను ఏమాత్రం దృష్టిపెట్టను. నా పని పైన నేను దృష్టి పెడతాను. ముఖ్యంగా మనం ఏది పట్టించుకోవాలి? ఏది వదిలేయాలి? అనే విషయంపై మనకు క్లారిటీ ఉండాలి. ఒక మహిళగా మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో మనం ముందుకు సాగలేము. అందుకే సమయం వచ్చినప్పుడు వాటిపై స్పందిస్తాను. ప్రస్తుతం పనిమీదనే దృష్టి పెడుతూ ఏం చేయాలనుకుంటున్నానో దానిపైనే ఫోకస్ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఏడాది తర్వాత స్పందించిన తమన్నా మాటలకు అనుకపూర్ స్పందిస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇకపోతే ఈ వివాదం ఎక్కడ మొదలైంది ? అనే విషయానికి వస్తే 2025లో స్త్రీ 2 అనే చిత్రంలో ఆజ్ కీ రాత్ అని స్పెషల్ పాటలో తమన్నా కనిపించింది. ఈ పాట గురించి అను కపూర్ మాట్లాడుతూ.. “తమన్నా పాల లాంటి ముఖం, శరీరం.. పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సహాయపడతాయి” అంటూ కామెంట్ చేశారు.
also read:ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూతురి అన్నప్రాసన వేడుక..ఫోటోలు వైరల్!
అను కపూర్ విషయానికి వస్తే.. భారతీయ నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, రేడియో డిస్క్ జాకీగా కూడా పనిచేసిన ఈయన.. టెలివిజన్ ప్రెజెంటర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 45 సంవత్సరాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈయన తోటి నటిపై ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.