E-Paper
Advertisement

విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?

విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?
Advertisement

Aishwarya Arjun -Umapathi: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక హీరో తన భార్యతో కలిసి కనిపించకపోయిన లేదంటే ఒక హీరోయిన్ తన భర్తతో కలిసి కనిపించకపోయినా వారి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి రూమర్లు స్టార్ హీరో అర్జున్ సర్జా(Arjun Sarja) పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) విషయంలో చోటు చేసుకుంది. ఐశ్వర్య అర్జున్ 2024 జూన్ నెలలో తన ప్రేమించిన వ్యక్తి ఉమాపతి(Umapathi)తో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే.

తెరపైకి ఐశ్వర్య ఉమాపతి విడాకుల వార్తలు…

వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఉమాపతి ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ రామయ్య కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఉమాపతి ఐశ్వర్య అర్జున్ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత ఈ జంట కలిసి ఎక్కడ కనిపించిన సందర్భాలు లేవు. అయితే తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా ఉన్నఫలంగా వీరి విడాకుల వార్తలు తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు.

ఘనంగా అంజనా సర్జా వివాహం..

Advertisement

ఇటీవల అర్జున్ సర్జ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరిగింది. 14 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విదేశీ వ్యక్తిని ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అర్జున్ సర్జా పెద్ద అల్లుడు ఉమాపతి ఎక్కడా కనిపించకపోవడంతో వీరి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. ఇలా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. అయితే ఐశ్వర్య సింగిల్ గా ఈ పెళ్లి వేడుకలలో కనిపించడం గమనార్హం.

నిజంగానే విభేదాలు వచ్చాయా..

ఇలా ఐశ్వర్య భర్త ఉమాపతి ఈ పెళ్లి వేడుకలలో కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా? విడాకులు తీసుకోబోతున్నారా? అందుకే అర్జున్ చిన్న కుమార్తె పెళ్లి వేడుకలలో ఉమాపతి కనిపించలేదా? అంటూ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే వీరిద్దరూ విడిపోబోతున్నారా అందుకే పెళ్లికి హాజరు కాలేదా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై హీరో అర్జున్ లేదా తన కుమార్తె ఐశ్వర్య స్పందించాల్సి ఉంది.

Advertisement

Also Read: శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి ఉంటే విన్నర్ అయ్యేవారు: కౌశల్ మండా

Related News

ఇరుముడి మూవీ టీమ్ కి షాక్.. కార్మికశాఖ నోటీసులు!

కావ్య అనిరుద్ పెళ్ళి వేడుకలు షూరూ.. డోలక్ పై డాన్సులతో రచ్చ రచ్చ!

ముసాఫిర్ డైరెక్టర్ సంజయ్ గుప్తా మృతి..ఏం జరిగిందంటే?

సీనియర్ హీరోకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్నా!

నటుడు సునీల్ రెడ్డి ఎవరి కుమారుడో తెలుసా..?

సాహో బ్యూటీ సరికొత్త అవతారం.. ఈసారి గట్టిగానే కొట్టేలా ఉందిగా!

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?

Big Stories

Advertisement
×