BigTV English

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి కీలక అప్డేట్.. సంజయ్ దత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి కీలక అప్డేట్.. సంజయ్ దత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..


The Raja Saab Update: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. అందులో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో హారర్, కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ సినిమా.

సంజయ్ దత్ లుక్ అవుట్


అయితే తాజాగా ది రాజా సాబ్ నుంచి కీలక అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమాలోని సంజయ్ దత్ లుక్ విడుదల చేశారు. ఇవాళ జూలై 29 సంజయ్ దత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన లుక్ ని విడుదల చేశారు. హ్యాపీ బర్త్ డే పవర్ హౌజ్, వర్సటైల్ సంజు బాబా అంటూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. కాగా ప్రస్తుతం ఆయన లుక్ సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన ఓల్డ్ లుక్ లో సీరియస్ గా కనిపించారు. ఇందులో ఆయన పాత్ర పేరు సంజయ్ బాబా అని తెలుస్తోంది. ప్రస్తుతం సంజయ్ దత్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

చంద్రలేఖతో తెలుగు తెరపైకి..

కాగా సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేజీయఫ్ తో సౌత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. అంతకు ముందే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన నాగార్జున చంద్రలేఖ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. కొన్ని క్షణాలు పాటు తెరపై అలా మెరిసారు. ఆ తర్వాత రామ్ చరణ్ హిందీ డెబ్యూ చిత్రం జంజీర్ లో కీలక పాత్ర చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ తో ఇక్కడ కూడా గుర్తింపు పొందారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన గన్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. జైలు నుంచి వచ్చాక క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు.

Also Read: Kingdom Premier: ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్.. కింగ్ డమ్ ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్.. కానీ ఇక్కడ కాదు

అమెరికాలో చికిత్స అనంతరం ఆయన కేజీయఫ్ తో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ దత్ పవర్ఫుల్ విలన్ రోల్లో భయపెట్టారు. ఆ తర్వాత రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ నేరుగా పలకరించారు. ఈ చిత్రంలో మరింత దగ్గరైన ఆయన ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇందులో ఆయన తాత పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఆయన ఆత్మగా కనిపిస్తారని ఇన్ సైడ్ సినీ సర్కిల్లో టాక్. కాగా ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 2025 డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×