BigTV English

Viral Video: కార్మికుడిపై ప్రతాపం.. తలకిందులుగా వేలాడ దీసి, ఆ తర్వాత, వైరల్ వీడియో

Viral Video: కార్మికుడిపై ప్రతాపం.. తలకిందులుగా వేలాడ దీసి, ఆ తర్వాత, వైరల్ వీడియో

Viral Video: గురుగ్రామ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భవనం సెల్లారులో వలస కార్మికుడిని తలక్రిందులుగా వేలాడ దీసి కొట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కారణం ఏంటన్నది కాసేపు పక్కనబెడితే దీనిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.


హర్యానాలోని గురుగ్రామ్‌లో సెక్టార్ 37లోని ఐఎల్‌డి గ్రీన్స్ కాంప్లెక్స్‌లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లేబర్‌ని దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని వలస కార్మికుడు చెబుతున్నా, కాంట్రాక్టర్ ఏ మాత్రం వినలేదు. ఏడుస్తూ వేడుకుంటున్నట్లు కనిపించింది.

కాంట్రాక్టర్ చేసిన పనిని మరొకరు సమర్థించే ప్రయత్నం చేశారు. సంఘటన జూన్ 2025లో జరిగినట్లు చెబుతున్నారు. వీడియో మాత్రం జూలై 28న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కార్మికుడిని భవనం స్తంభానికి తలకిందులుగా వేలాడదీసి ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కర్రతో వాడ్ని చావబాదుతున్నారు.


ఈ తతంగం చాలాసేపు జరిగింది. దీన్ని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. కాంట్రాక్టర్ స్వయంగా హర్యానాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితుడని, అతని భార్య హైకోర్టు న్యాయవాది అని చెబుతున్నారు.

ALSO READ: చీమలకూ కుల పిచ్చి.. ఇదిగో ఇలా తమ క్యాస్ట్, పని డిసైడ్ చేసుకుంటాయట

కార్మికుడ్ని బెదిరిస్తూ వివాదాన్ని అణచివేయడానికి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపలాకు బదులుగా అందరు గార్డులు తాగి పార్టీ చేసుకుంటున్నారని చెప్పడం వాయిస్ వినబడుతోంది. జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని, ఎవరూ తాగరని అంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగుర్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు నిర్మాణ సంస్థకు చెందిన యోగేంద్ర భాటి అని భావిస్తున్నారు. అదే కంపెనీకి చెందిన మరో ప్రతినిధి పేరు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు అధికారులు.

 

Related News

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Love marriage ban: ప్రేమించారో గ్రామ బహిష్కారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పెద్దలు.. ఎక్కడంటే?

Big Stories

×