Kingdom Premieres Starts at 11 PM: కింగ్ డమ్ ప్రీమియర్స్ గ్రీన్ సిగ్నల్ దొరకింది. కానీ, ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అదేంటి.. ప్రీమియర్స్ అంటే అభిమానులకు పండగే కదా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే పూర్తి ఆర్టికల్ చదివేయండి. కాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ’కింగ్ డమ్‘ మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. జూలై 31న వరల్డ్ వైడ్ ఈ సినిమా విడుదల కానుంది. ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది.
మూవీ హిట్.. విజయ్ కి పరీక్ష
విజయ్ కి హిట్ పడి చాలా కాలం అయ్యింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ తో వచ్చిన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అందరి ఆశలు కింగ్ డమ్ పైనే ఉన్నాయి. విజయ్ సైతం ఈసారి పక్కా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. దీంతో కింగ్ డమ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ పై సస్పెన్స్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా? లేదనే సందేహాలు నెలకొన్నాయి. అయితే కింగ్ డమ్ ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ దొరికింది.
ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్ కానీ..
కానీ, ఇక్కడ కాదట. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్స్ పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రిమియర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కింగ్ డమ్ కి ప్రీమియర్స్ ఉండే అవకాశం లేనట్టే అన్నట్టు ఉంది. ఇటీవల టికెట్స్ రేట్స్ పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ప్రీమియర్స్ గురించి ప్రస్తావించలేదు. ఏపీలో ప్రీమియర్స్ అనుమతి లేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ ఇండియన్ ఫ్యాన్స్ కి చేదు వార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రీమియర్స్ లేవు కానీ, ఓవర్సిస్ లో ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాత్రి 11 గంటలకు అక్కడ పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ కంటే అమెరికాలోని ఫ్యాన్స్ ముందు కింగ్ డమ్ మూవీ చూడబోతున్నారట.
కింగ్ డమ్ టికెట్ రేట్స్ ఇలా
ఇది ఇండియన్ ఫ్యాన్స్ బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ లేవు కానీ, ఎర్టీ మార్నింగ్ షోలు ఉండనున్నాయి. ఏపీ ప్రీమియర్స్ లేవు. కానీ, తొలి షో ఉదయం 4 గంటలకే పడనుంద కాగా స్పై యాక్షన్ డ్రామా రూపొందిన ఈ చిత్రంలో శ్రీలంక ఎల్ టీటీఈ నాయకుడు ప్రభాకరన్ ప్రస్తావన రానుందని టాక్ ఉంది. అన్న సెంటిమెంట్ చూట్టూ ఈ సినిమా సాగనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫ్యార్యూన్ ఫోర్ బ్యానర్ సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు. కాగా మూవీకి రిలీజ్ కి వారం ముందే ఏపీ ప్రభుత్వం కింగ్ డమ్ టికెట్స్ రేట్స్ పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ కి రూ. 50, మల్టీప్లెక్స్ లో రూ. 75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెంచిన ధరలు పది రోజుల వరకు అమలులో ఉంటాయని ఏపీ స్పష్టం చేసింది.
Also Read: Jr NTR New Look: ఇప్పుడు ఏమంట్రా అబ్బాయిలు.. హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ కొత్త లుక్, ఫోటోలు వైరల్