వందేభారత్ రైళ్లకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా దాని స్పీడుకే చాలామంది ప్రయాణికులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో కూర్చొని మాత్రమే ప్రయాణించాలి. త్వరలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు వీలుగా వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా వస్తున్నాయి. వాటిలో బెర్తులు ఉంటాయి. కాబట్టి.. హ్యాపీగా నిద్రపోతూ ప్రయాణించవచ్చు. ఇవి కూడా అడ్వాన్సుడ్ టెక్నాలజీతోనే వస్తున్నాయి. మన వందేభారత్ స్ఫూర్తితో అమెరికాలో కూడా కొన్ని లగ్జరీ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. అవే ‘ఎయిరో ట్రైన్స్’. ఇందులో కల్పిస్తున్న సదుపాయాలు గురించి తెలిస్తే.. తప్పకుండా మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
2026లో ఎంట్రీ..
అమెరికాకు చెందిన ఆమ్ట్రాక్ (Amtrak) కంపెనీ త్వరలోనే ‘ఎయిరో ట్రైన్స్’ను ప్రవేశపెట్టనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన సిమెన్స్ కంపెనీ ఈ రైళ్లను తయారు చేస్తోంది. మొత్తం 83 రైళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ తయారుచేసిన ఎయిరో ట్రైన్ ఫస్ట్ లుక్‌ను ఇటీవలే సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అందులో ఏర్పాటు చేసిన సీట్లు, సదుపాయాలు గురించి తెలిస్తే.. తప్పకుండా మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
బోగీల్లోనే కెఫే, బార్‌లు..
చక్కని వ్యూ కోసం ఈ రైళ్లు పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ (Panoramic Windows) ఏర్పాటు చేశారు. అలాగే.. ఎంతసేపైనా అలసట రాకుండా ఉండేలా ప్రత్యేకమైన సీటింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. సీట్లు కంఫర్ట్‌గా ఉండేందుకు ఎర్గోనామిక్ సీట్లు ఏర్పాటు చేశారు. మెత్తని కుషన్స్ కలిగిన హెడ్‌రెస్ట్స్ అమర్చారు. సీటు ముందు పెద్ద ట్రే, వాటర్ బాటిల్ హోల్డర్లు, సీట్ బ్యాక్ టాబ్లెట్ స్టాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ రైలులో ఉండే కెఫే కారులో కాఫీతోపాటు ఫుడ్, డ్రింక్స్ కూడా లభిస్తాయి. ఇందులో చిన్న సైజు బార్ కూడా ఉంది. అందులో బీర్, వైన్ విక్రయిస్తారు.
వైఫై, టచ్ లెస్ టాయిలెట్స్‌తో..
జర్నీ చేసేవారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు ఫ్రీ వైఫైను కూడా ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ పోర్టులు, ఛార్జింగ్ బోర్డులు, డిజిటల్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి. కాబట్టి.. ఈ రైలులో పని చేసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. సినిమాలు, సీరిస్‌లు చూస్తూ టైంపాస్ చెయొచ్చు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని టాయిలెట్‌లు ముట్టుకోకుండానే తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. ఇందుకు రెస్ట్‌రూమ్స్‌లో టచ్‌లెస్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఈ రైలు ప్రయాణిస్తున్న మీకు అసలు శబ్దాలు వినిపించవు. ఎలాంటి కుదుపు లేకుండా చాలా సాఫీగా ప్రయాణం సాగిపోతుంది.
పర్యావరణానికీ నష్టం ఉండదు
పర్యవరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ రైలు ఇంజిన్‌ను తయారు చేశారు. ఇది డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లతో నడుస్తుంది. కానీ, ఎలాంటి హానికర ఉద్గారాలను గాల్లోకి విడుదల చెయ్యదు. ఇక స్పీడు విషయానికి వస్తే.. ఈ రైలు గంటకు 125 మైళ్లు (సుమారు 200 కిమీలు) వేగంతో దూసుకుపోతుంది. అయితే, ఈ స్పీడుకు తట్టుకునే విధంగా ఆ మార్గంలో ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చెయ్యాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2026 నాటికి పసిఫిక్ నార్త్‌వెస్ట్, నార్త్‌ఈస్ట్ ప్రాంతాల్లోని పాత రైళ్ల స్థానంలో ఎయిరో ట్రైన్‌లను ప్రవేశపెడతారు. బోస్టర్, వాషింగ్టన్, డీసీ, న్యూయార్క్ నగరాల మీదుగా ఈ రైళ్లు సేవలు అందిస్తాయి. మన రైళ్లను కూడా త్వరలో ఇలా అప్‌గ్రేడ్ చేస్తే బాగుంటుంది కదా.
📍 The first Amtrak Airo trainset is officially en route!
Built at Siemens’ Sacramento facility, this trainset is headed to Pueblo, CO for testing before launching on Amtrak Cascades service in the Pacific Northwest in 2026.
This is just the beginning — 83 trainsets will… pic.twitter.com/dDd83nCGIO
— Amtrak (@Amtrak) July 25, 2025
Images Credit: Amtrak