E-Paper
Advertisement

Nivetha Pethuraj: అసలు జ్ఞానం లేదు… వారిపై హీరోయిన్ సీరియస్.!

Nivetha Pethuraj: అసలు జ్ఞానం లేదు… వారిపై హీరోయిన్ సీరియస్.!

Nivetha Pethuraj:సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది కేవలం సినిమాల వరకూ గ్లామర్ గా ఉండడం మాత్రమే కాకుండా బయట జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటారు. కొంతమంది హీరో, హీరోయిన్లు అయితే బయట సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ.. బయట జరిగే అరాచకాలపై సోషల్ మీడియా వేదికగా వారిని ఏకిపారేస్తూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి ఒక విషయం గురించే హీరోయిన్ నివేతా పేతురాజ్ సంచలన పోస్ట్ పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ సమాజంలో ఉన్న కొంతమందికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. మరి ఇంతకీ నివేదా పేతురాజ్ పెట్టిన పోస్ట్ ఏంటి? ఎందుకు ఆ పోస్ట్ ఇంతలా వైరల్ అవుతోంది ? అనేది ఇప్పుడు చూద్దాం..

సివిక్ సెన్స్ లేదంటున్న నివేతా ..

సౌత్ హీరోయిన్ నివేతా పేతురాజ్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది..ఇంత పెద్ద జనసాంద్రత కలిగిన దేశంలో పిల్లలకు, పెద్దలకు పౌర జ్ఞానం నేర్పించాలి .. ఇక్కడ కనీస విషయం ఏంటంటే..క్యూలు కట్టకుండా, రోడ్లపై ఉమ్మి వేయకుండా, ఇతరులను వేధించకుండా, నియమాలను ఉల్లంఘించకుండా లేదా సాధారణ రోజువారి మర్యాదలను మర్చిపోకుండా ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం.. అలాగే తరచుగా మనకు పరీక్షలు అవసరం కావచ్చు. ఇది జోక్ కాదు” అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టింది.

ALSO READ:Heroine Extra Expenses : నిర్మాతలకు భారంగా మారుతున్న హీరోయిన్… ఆ ఒక్క సక్సెస్ వల్లే ?

ఇప్పటికైనా మారుతారా?

అయితే ఈ పోస్ట్ సమాజంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై ఈ విధంగా పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే భారతదేశంలో చాలామంది జనాభా ఉన్నారు. కానీ ఎవరికి కూడా సివిక్ సెన్స్ అనేది ఉండదు.కచ్చితంగా పిల్లల నుండి మొదలు పెద్ద వాళ్ల వరకు ఈ సివిక్ సెన్స్ అనేది నేర్పించాలంటూ ఈ హీరోయిన్ తన పోస్టులో పేర్కొంది. అంతేకాదు ఇంత మంది జనాభా ఉన్న మన దేశంలో ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించరు.ఏదైనా గుడికి లేదా ఇంకా వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు క్యూలైన్లో వెళ్లకుండా ఒకరిని ఒకరు నెట్టి వేసుకుంటూ వెళ్తూ తొక్కిసలాటలు జరిగేలా ప్రేరేపిస్తున్నారు.

అందుకే తొక్కిసలాటలు..

ఇలా క్యూ లైన్ పాటించకపోవడం వల్లే ఎన్నో తొక్కిసలాటలు జరిగి చాలామంది చనిపోతున్నారు. మరొక విషయం ఏమిటంటే.. రోడ్లపై ఉమ్మి వేయకూడదు అని చెప్పినా కూడా ఎంతోమంది రోడ్లపై ఉమ్మి వేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ రూల్స్ ఇవే అని చెప్పే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఆ రూల్స్ ని అస్సలు పాటించరు. నియమాలకు వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘిస్తూ తప్పు దారిలో వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఇతరులను వేధించడంలో ముందుంటారు.అయితే ఈ విషయాల్లో సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం అని అర్థం వచ్చేలా నివేత పేతురాజ్ ఈ పోస్ట్ పెట్టింది.

హీరోయిన్ కి మద్దతుగా నెటిజన్స్..

క్రమశిక్షణ లేకుండా సమాజం తయారవుతుంది అని ఈ హీరోయిన్ పోస్ట్ ఉద్దేశం.. అలా నివేత పేతురాజ్ పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు ఈ హీరోయిన్ పెట్టిన పోస్ట్ పట్ల మద్దతు తెలుపుతున్నారు. మంచి సందేశాత్మక పోస్ట్ పెట్టిందని సపోర్ట్ చేస్తున్నారు. మరి కొంతమందేమో ముందు మీరు పాటించండి.. తర్వాత మమ్మల్ని అందురు గాని అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

నివేత పేతురాజ్ సినిమాలు..

ఇక నివేత పేతురాజ్ సినిమాలు,పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఓరు నాల్ కూతు అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్.. శ్రీ విష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురంలో, బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్ దాస్ కా ధమ్ కీ వంటి సినిమాల్లో నటించింది.

నివేత పేతురాజ్ వ్యక్తిగత జీవితం..

అలా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే రాజ్ హిత్ ఇబ్రాన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. రీసెంట్ గా ఆయనతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్మెంట్ అయినట్టు రింగ్ ఎమోజిని క్యాప్షన్ లో పెట్టడంతో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ భావించారు. ఇక వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి.

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×