Ration Without Ration Card: రేషన్ కార్డు లేకుండానే రేషన్ పొందవచ్చా? అదెలా సాధ్యం? కేంద్రప్రభుత్వం కొత్తగా ఏమైనా నిబంధనలు తెస్తోందా? ప్రజాపంపిణీ వ్యవస్థపై మార్పులు చేర్పులు చేస్తోందా? ఆధార్ కార్డు చూపించి రేషన్ తీసుకునే పద్దతి వస్తోందా? ఈ మధ్యకాలంలో రేషన్ కార్డు లేకుండా రేషన్ పొందవచ్చనే వార్తలు జోరందుకున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
రేషన్ కార్డు లేకుండా రేషన్ తీసుకోవచ్చు?
దేశంలో పేదలను తగ్గించుకునేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. రేషన్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో వచ్చింది ఆధార్ కార్డు. ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ని అన్నింటికీ లింకు చేశారు. బ్యాంకు ఖాతాలు, రేషన్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్లను ఇలా ఏది చూసినా ప్రతీదానికీ ఆధార్ లింకు చేసి ఉంటుంది. రేషన్ కార్డు లేకుంటే పథకాలు రావచ్చని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు రేషన్ కార్డు అత్యంత కీలకమైంది. రేషన్ విషయంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రంతో అనుసంధానం అవుతున్నాయి. దీనివల్ల చాలావరకు ప్రజా పంపిణీ వ్యవస్థ చాలావరకు మెరుగుపడింది. ముఖ్యంగా థంబ్ వేస్తే రేషన్ ఇచ్చే పద్దతి ప్రస్తుతం నడుస్తోంది. లక్షలాది మంది ప్రజలు, వలస కార్మికులకు ఇప్పటికీ రేషన్ అనేది అందుబాటులో లేకపోవడం విడ్డూరమైన విషయం.
ఇంకా చర్చల దశలో.. రాబోయే రోజుల్లో
ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ ఆదాయం పొందే కుటుంబాలు కష్టాలు లేకపోలేదు. రేషన్ కార్డుని కొత్త ప్రాంతాల్లో పొందాలంటే చాలా కష్టంతో కూడిన పని. అందుకు రకరకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు అధికారులు. త్వరలో రానున్న కొత్త విధానం ప్రకారం.. ఆధార్ లేదా ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును ఉపయోగించి బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, వంట నూనె వంటి సబ్సిడీతో కూడిన నిత్యావసరాలను తీసుకోవచ్చు. తద్వారా రేషన్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ALSO READ: విజయ్ ఇచ్చిన పరిహారం తిరస్కరించిన బాధితురాలి భార్య
ఈ విషయంలో ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తేనే సాధ్యమవుతుందని అంటున్నారు కొందరు నిఫుణులు. ఆధార్ లేని వ్యక్తులు ఓటరు కార్డు లేదంటే పాన్ కార్డులు వంటి ప్రత్యామ్నాయ కార్డులను రేషన్ తీసుకోవచ్చు. కొత్త పద్దతి వల్ల వలస కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు తమ రేషన్ తీసుకోవచ్చు. ఈ సంస్కరణ వల్ల ప్రభుత్వం జారీ చేసే కార్డు వల్ల ప్రతి ఒక్కరూ ఆహార ధాన్యాలను పొందవచ్చు. PDSలో అవినీతి, నకిలీ కార్డుల దుర్వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది చర్చల దశలో మాత్రమే ఉంది.