Intinti Ramayanam Kamal : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లో ఇంటింటి రామాయణం ఒకటి. ఈమధ్య ఈ సీరియల్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది అని జనాలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి పెద్ద కోడలు ఎలా ఎదుర్కొంటుంది అన్న దానిపై ఈ సీరియల్ స్టోరీ ఉంటుంది. ఇందులో వదిన అంటే అమితమైన అభిమాని గా కమల్ క్యారెక్టర్ ఉంటుంది. వదిన తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోను అంటూ కమల్ అంటాడు. వదిన కంట్లో ఉంది కన్నీళ్లు చూడలేని మరిది తన కోసం ఏదైనా చేస్తాడు ఎవరితోనైనా గొడవపడతాడు. ఆ పాత్రలో నటించింది తెలంగాణ పోరగాడు వరుణ్ రాజ్.. ఈ సీరియల్కు ఇతను తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే చాలా సీరియల్స్ పోటీపడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఇంటింటి రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనని మోసం చేశారని ఒక కుటుంబం ఇదే పగ పెంచుకున్న అమ్మాయి ఆ కుటుంబాన్ని రోజురోజుకీ కష్టాలపాలు చేస్తూ ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద కోడలు ఏదైనా చేస్తుంది. ఈ స్టోరీ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో అమాయకపు వ్యక్తిగా కమల్ నటిస్తాడు. మెయిన్ క్యారెక్టర్ల తర్వాత ఎక్కువగా హైలైట్ అయ్యేది ఈ క్యారెక్టర్.. ఈ పాత్రలో నటించిన వరుణ్ రాజ్ గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించి బాగా ఫేమస్ అయ్యారు. ఈయన ఒక్క రోజుకి 15 వేలకు పైగా రెమ్యూనరేషన్తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నెల లో 25 రోజుల వరకు ఈ సీరియల్ షూటింగ్ జరుగుతూనే ఉంటుంది ఆ లెక్కన చూస్తే ఇతనికి సంపాదన లక్షల్లోనే ఉంటుందని తెలుస్తుంది.
తెలుగు అబ్బాయి వరుణ్ రాజ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు బీటెక్ వరకు చదివాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో అటుగా అడుగులు వేశారు. మొదట మోడలింగ్లో అడుగుపెట్టిన ఈయన తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీని తర్వాత ప్రముఖ ఛానల్ ఈటీవీ లో ప్రసారమైన గంగోత్రి సీరియల్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఈ సీరియల్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో వరుణ్ రాజ్ క్రేజీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇంటింటి రామాయణంలో నటిస్తున్నారు. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకుంది. ఇకపోతే వరుణ్ కు ఇంకా పెళ్లి కాలేదు.