OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సైకలజికల్ థ్రిల్లర్ ఒక డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ కథలో ఒక జర్నలిస్ట్ లగ్జరీ క్రూజ్ షిప్‌లో ఒక మర్డర్‌ను చూస్తుంది. కానీ ఆమె చెప్పిన విషయాన్ని ఎవరూ నమ్మరు. ఆమె ఆ రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక స్టోరీ ఊహించని ట్విస్టులతో ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“ది వుమన్ ఇన్ క్యాబిన్ 10” 2025లో విడుదలైన అమెరికన్ సైకలజికల్ థ్రిల్లర్ సినిమా. దీన్ని సైమన్ స్టోన్ డైరెక్ట్ చేశారు. ముఖ్య పాత్రల్లో కిరా నైట్లీ (లో బ్లాక్‌లాక్), గాయ్ పీర్స్ (రిచర్డ్ బుల్మర్), గుగు మ్భాతా-రా (ఆన్) నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఇది 2016లో రూత్ వేర్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. IMDb 5.9/10 రేటింగ్ ని కూడా పొందింది.
హీరోయిన్ కు ఒక కొత్త అసైన్‌మెంట్ వస్తుంది. ఒక లగ్జరీ క్రూజ్ షిప్ మొదటి ప్రయాణం గురించి రాయడం. ఈ షిప్ యజమాని ఆన్ బుల్మర్ లెక్యూమియాతో బాధపడుతూ ఉంటుంది. ఇక దీని కోసం హీరోయిన్ షిప్‌లోకి వస్తుంది. అక్కడ ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ బెన్ కూడా ఉంటాడు. షిప్‌లో పార్టీలు జరుగుతూ సందడిగా ఉంటుంది. ఒక రాత్రి హీరోయిన్ తన పక్క క్యాబిన్ లో ఒక మహిళను చూస్తుంది. ఆమెను ఎవరో సముద్రంలోకి బలవంతంగా తోసేయడం చూస్తుంది. ఈ సంఘటనతో ఆమె భయాందోళనకు గురవుతుంది. ఈ విషయాన్ని షిప్ సిబ్బందికి చెబుతుంది. కానీ ఆ క్యాబిన్ లో ఎవరూ లేరని, ఆమె చెప్పిన మహిళ గురించి ఎవరికీ తెలియదని చెబుతారు. హీరోయిన్ మాటలను ఎవరూ నమ్మరు.
Read Also : కుళ్లిపోయిన స్థితిలో శవాలు… మాస్క్ వేసుకున్న సైకో అరాచకం… మంచు లక్ష్మి కిర్రాక్ ‘డెడ్లీ కాన్స్పిరసీ’
అయితే ఆమెకు అక్కడ ఏదో తప్పు జరిగిందని అనిపిస్తుంది. దెంతో ఆమె స్వయంగా రహస్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె బెన్ సహాయం తీసుకుంటుంది. కానీ షిప్‌లోని ఇతర ప్రయాణికులు, సిబ్బంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. కథలో ఊహించని ట్విస్ట్‌లు వస్తాయి. షిప్ యజమాని ఆన్‌కు లెక్యూమియా లేదని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని తెలుస్తుంది. హీరోయిన్ కి ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థం కాక గందరగోళంలో పడుతుంది. చివరికి అక్కడ చనిపోయిన మహిళ ఎవరు ? ఎందుకు చంపారు ? ఈ కుట్రను హీరోయిన్ ఎలా బయట పెడుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.