Vishwambhara : వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా విశ్వంభర. చాలా ఏళ్లు తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోసియో ఫాంటసీ జోనర్ లో సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ అవకాశం చాలా కొద్దిమందికి దొరుకుతుంది. బింబిసారా సినిమాతో మంచి హిట్ అందుకున్న వశిష్టకు ఆ అవకాశం దక్కింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాలు తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ జోనర్ లో సినిమా చేయలేదు. స్వతహాగా వశిష్ట మొదటి సినిమా బింబిసార ఆ జోనర్ లోనే వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మెగాస్టార్ తో కూడా అదే జానెర్ లో సినిమా చేస్తున్నాడు వశిష్ట.
కీరవాణిని పక్కన పెట్టడానికి కారణం
ఒక సినిమాకి కథ, మాటలు ఎంత కీలకమో ఆ సినిమాకి సంగీతం కూడా అంతే కీలకం. థియేటర్ కు ఆడియన్ రావడానికి మొదట వినిపించే ఆయుధం సంగీతం. ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఇదివరకు కీరవాణి సంగీతం అందించారు. అయితే విశ్వంభర సినిమాకి కూడా కీరవాణి సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో సంబంధించి ఒక స్పెషల్ సాంగును భీమ్స్ కంపోజ్ చేశారు. ఒకవైపు సంగీత దర్శకుడుగా కీరవాణి పని చేస్తున్న కూడా భీమ్స్ చేయడానికి కారణం ఏంటి అనే దానిపైన క్లారిటీ ఇచ్చాడు వశిష్ట. ఒకవైపు ఎం ఎం కీరవాణి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మ్యూజిక్ వర్క్స్ లో బిజీగా ఉండటం వలన, అతని సజెషన్ తోనే భీమ్స్ ను సంగీత దర్శకుడుగా ఈ పాటకు తీసుకోవాల్సి వచ్చింది.
తప్పేముంది.?
కీరవాణి ఈ డెసిషన్ చెప్పినప్పుడు వశిష్ట కీరవాణి ను అడిగారట. దీనిలో పెద్దగా తప్పేముంది. ఒక పాట కోసం చాలామంది సాహిత్య రచయితలను ఎలా అయితే కలుస్తామో, అలానే కంపోజ్ చేయడానికి కూడా కలవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. గతంలో మణిశర్మ కంపోజ్ చేసిన ఇంద్ర సినిమాలో కూడా ఆర్పి పట్నాయక్ ఒక పాటను కంపోజ్ చేశారు. అంటూ మాట్లాడారు. మరోవైపు కీరవాణి కూడా ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వలన, భీమ్స్ తో ఈ స్పెషల్ సాంగ్ చేయించాడు వశిష్ట. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తో క్లారిటీ వచ్చేసింది.
Also Read: Jyothi Krishna: త్రివిక్రమ్ పేరు అందుకే వేశాం… మొత్తానికి క్లారిటీ ఇచ్చిన జ్యోతి కృష్ణ!