BigTV English

Indian Railways New Service: రైలెక్కుతున్న కార్లు.. న్యూ ట్రావెల్ ట్రెండ్ స్టార్ట్.. రైల్వే సర్వీస్ మీకోసమే!

Indian Railways New Service: రైలెక్కుతున్న కార్లు.. న్యూ ట్రావెల్ ట్రెండ్ స్టార్ట్.. రైల్వే సర్వీస్ మీకోసమే!

Indian Railways New Service: హైవేపై గంటల కొద్దీ డ్రైవ్ చేస్తూ అలసిపోయి గమ్యస్థానానికి చేరుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ట్రాఫిక్, వర్షాకాలంలో రోడ్ల పరిస్థితులు, లాంగ్ డ్రైవ్ అలసట.. ఇవన్నీ కలిసి ట్రిప్ మొదలవ్వకముందే చిరాకెత్తిస్తాయి. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వేలు అందిస్తున్న కొత్త సర్వీస్ ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేస్తోంది. కారు మీది.. ప్రయాణం మాది అన్నట్టుగా, మీ వాహనాన్ని రైలెక్కించి, మీరు కంఫర్ట్‌గా సీట్లో కూర్చుని గమ్యస్థానానికి చేరే ఫెసిలిటీ రాబోతోంది.


సర్వీస్ అదుర్స్..
మహారాష్ట్రలో తొలిసారిగా కార్లను రైల్లో తరలించే ప్రత్యేక కార్ ఫెర్రీ ట్రైన్ సర్వీస్ ప్రారంభం కాబోతోంది. రత్నగిరి జిల్లా కొలాడ్ స్టేషన్ నుండి గోవా వెర్ణా స్టేషన్ వరకు ఈ ప్రత్యేక రైలు నడవనుంది. ఈ ప్రయాణం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహన బోగీలు, సాధారణ ప్రయాణికుల బోగీలతో కలిసి నడుస్తుంది. కారు యజమానులు ముందుగా తమ వాహనాన్ని ప్రత్యేక కోచ్‌లో పార్క్ చేసి, తర్వాత సౌకర్యవంతంగా రైలులో కూర్చుని ప్రయాణించొచ్చు. ఈ ప్రయాణం దాదాపు 12 గంటల్లో పూర్తవుతుంది, హైవే డ్రైవ్ టెన్షన్ లేకుండా స్మూత్‌గా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

సీజన్ కు తగినట్లుగా న్యూ ట్రెండ్..
ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా ముంబయి నుంచి గోవా, రత్నగిరి వైపు భారీగా ప్రయాణాలు జరుగుతాయి. ఈ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వేలు గణేష్ ఉత్సవానికి ముందే ఈ సర్వీస్ ప్రారంభించేందుకు ప్లాన్ చేశాయి. ఈ ప్రాజెక్ట్‌ను డ్రైవ్ లెస్ – ట్రావెల్ మోర్ అనే స్లోగన్‌తో ప్రజలకు అందించనున్నారు. ట్రాఫిక్, డ్రైవింగ్ అలసట వంటి సమస్యలను తగ్గిస్తూ ఇది కొత్త యుగానికి దారితీయనుంది.


కారు చాలా సేఫ్ బాస్!
మహారాష్ట్ర – గోవా హైవేలు వర్షాకాలంలో కఠినమైన పరిస్థితులు కలిగిస్తాయి. ఇలాంటి సీజన్లలో కార్ ఫెర్రీ ట్రైన్ అనేది డ్రైవర్లకు ఒక వరమనే చెప్పాలి. కారుతో కలిసి ప్రయాణించడం అంటే ఫ్యామిలీ ట్రిప్స్, ఫ్రెండ్స్ గ్రూప్ టూర్లకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అవుతుంది. కార్లను రైలులో సేఫ్‌గా ఫిక్స్ చేయడానికి ప్రత్యేక ర్యాంపులు, క్లాంప్లు, సేఫ్టీ లాక్స్ వాడతారు. రైల్వే స్టాఫ్ పూర్తి జాగ్రత్తలు తీసుకుని వాహనాన్ని డెస్టినేషన్‌కి సేఫ్‌గా చేరుస్తారు.

Also Read: Indian Railways safety: రైల్వే సేఫ్టీ లో మరో ముందడుగు.. కొత్త సిస్టమ్ తో ట్రైన్ జర్నీ మరింత సేఫ్!

ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. సక్సెస్ అవగానే దేశంలోని ప్రధాన టూరిస్ట్ రూట్లపై కూడా ఇలాంటి సర్వీసులు ప్రారంభించే ప్లాన్ రైల్వేలది. ముంబయి – గోవా రూట్ ఈ కొత్త కాన్సెప్ట్‌కు టెస్ట్ బేస్‌గా ఉండబోతోంది. IRCTC ద్వారా బుకింగ్ సౌకర్యం, ఛార్జీలు, టికెట్ వివరాలను త్వరలో రైల్వే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పర్యావరణ పరంగా కూడా ఈ సర్వీస్ ఉపయోగకరం. వందల కార్లు ఒకేసారి రైల్లో తరలిపోవడం వలన ఇంధన వినియోగం తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్ కూడా కట్ అవుతుంది. పైగా డ్రైవింగ్‌లో కలిగే అలసట లేకుండా ప్రయాణికులు స్మూత్ ట్రావెల్ అనుభవం పొందుతారు. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే, భవిష్యత్తులో బెంగళూరు – గోవా, ముంబయి – కొచ్చి, ఢిల్లీ – సిమ్లా, మనాలి వంటి టూరిస్టు రూట్లపై కూడా కార్ ఫెర్రీ సర్వీసులు ప్రారంభం కావొచ్చు.

గణేష్ చతుర్థి ముందు ఈ సేవ ప్రారంభమవడం ట్రావెలర్స్‌కి నిజంగా సూపర్ గిఫ్ట్. ఇకపై గోవా హైవే ట్రాఫిక్, రోడ్ రిస్క్, అలసట అన్నీ మర్చిపోయి రైలెక్కుతున్న కార్లతో కొత్త ట్రావెల్ ట్రెండ్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. రైలెక్కుతున్న కార్లు.. కొత్త ట్రావెల్ ట్రెండ్ స్టార్ట్.. మీరు న్యూ ట్రెండ్ జర్నీకి రెడీనా?

Related News

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Airways New Rule: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Dussehra – Diwali: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

TIRUN Cruise: ఫ్యామిలీ ట్రిప్‌కి బంపర్ ఆఫర్.. 60శాతం డిస్కౌంట్, పిల్లలకు ఉచితం

Smallest Railway Station: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?

Viral Video: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!

Vande Bharat train: పూరికి నేరుగా వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి అంటే?

Big Stories

×