Movies in Theater :సాధారణంగా ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఏకంగా ఎనిమిది సినిమాలు థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. లాభాలు మాత్రం గుండు సున్నా అనే రేంజ్ లో ఆ సినిమాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా పెద్దగా బజ్ లేకపోవడం చూస్తుంటే అసలు ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా అనే అనడం కంటే అసలు ఏ సినిమాలు విడుదలవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ప్రమోషన్స్ లేకపోవడం.. దీనికి తోడు థియేటర్ కి వచ్చి చూడాలి అన్నట్టు ఏ ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) ‘భద్రకాళి’ మూవీ కాస్త వరకు ఆడియన్స్ లోకి వెళ్లినా ఈ సినిమాను థియేటర్ కి వచ్చి చూడాలని ఎవరు అనుకోవడం లేదు. పైగా ఈ సినిమాపై బజ్ కూడా ఏమీ లేదు అని చెప్పవచ్చు. మరి ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న ఆ ఎనిమిది చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
“ఒకే షాట్” అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసి ఉండరు’.. అంటే సినిమా అంతా మధ్యలో ఎక్కడా ఆపకుండా, ఒకే షాట్‌తో చిత్రీకరించబడింది. అడ్వెంచర్ కామెడీ తెలుగు సినిమాగా ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 18) థియేటర్లలో విడుదలయ్యింది. అసలు ఇలాంటి టైటిల్ తో ఒక సినిమా ఉంది అనే విషయం కూడా జనాలకు తెలియదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రేపు అనగా సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రాబోయే చిత్రాల విషయానికొస్తే..
భద్రకాళి:
విజయ్ ఆంటోని తాజాగా నటిస్తున్న చిత్రం భద్రకాళి. విజయ్ ఆంటోనీకి ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా.. రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఈ చిత్రాన్ని విజయ్ అంటోనీ ఫిలిం కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.
టన్నెల్:
వియత్నాం చరిత్రలో కీలక సమయంలో చేసిన పోరాటాలు, త్యాగాల భావోద్వేగా వాస్తవిక చిత్రమే ఈ టన్నెల్.. చారిత్రక రీ టెల్లింగ్ నేపథ్యంలో హృదయాన్ని తాకే కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బ్యూటీ:
యాక్షన్ డ్రామా రొమాంటిక్ మూవీ గా వస్తున్న ఈ చిత్రానికి జెఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. అంకిత్ కొయ్య, వీకే నరేష్, నీలకి పాత్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాలతో పాటు కర్మణ్యే వాధికారస్తే, వీర చంద్రహాస్, రక్ష, మిస్టర్ సోల్జర్ ఇలా పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలవుతున్నాయి.
ALSO READ:Bigg Boss 9: కెప్టెన్సీ కోసం మళ్లీ యుద్ధం.. ఈవారం గెలిచేదెవరు?