Bigg Boss 9: బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో కెప్టెన్సీ బాధ్యతలు కంటెస్టెంట్స్ కి ఒక వరం అనే చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్ గా నిలిచిన వారి మాటలను మిగతా కుటుంబ సభ్యులు వినాలి. అటు బిగ్ బాస్ కూడా కెప్టెన్ కే అనుకూలంగా అప్పుడప్పుడు వ్యవహరిస్తారు. అంతేకాదు కెప్టెన్ గా ఎన్నికైతే నామినేషన్స్ నుంచే కాదు ఎలిమినేషన్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఏదైనా సందర్భాలలో ఒక వ్యక్తిని నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలా ఈ కెప్టెన్సీ బాధ్యత పొందడానికి కంటెస్టెంట్స్ గట్టిగా పోటీ పడుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈసారి కూడా హౌస్ లో రెండవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ను నిర్వాహకులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే గత వారం సంజన సెలబ్రిటీల నుండి మొదటి కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లో తొలి కెప్టెన్ గా నిలిచి రికార్డు సృష్టించింది. ఇప్పుడు రెండవ వారం రెండవ కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్ .మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు? ఎవరు విజేతగా నిలవబోతున్నారు? అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.
ALSO READ:AA22 OTT : బన్నీ – అట్లీ మూవీ ఓటీటీ డీల్… ఇండియాలోనే హైయెస్ట్ ధరకు సోల్డ్ అవుట్ ?
11వ రోజు మొదటి ప్రోమో రిలీజ్..
ఇకపోతే రెండవ వారం రెండవ కెప్టెన్ గా నిలవడానికి సెలబ్రిటీస్ అయినా టెనెంట్స్ మధ్య అలాగే కామనర్స్ అయినా ఓనర్స్ మధ్య ఈ పోటీ నిర్వహించారు. ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ మాట్లాడుతూ..” కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా మీకు ఇస్తున్న రెండవ ఛాలెంజ్ బజర్ ఆర్ నో బజర్. ఓనర్స్, టెనెంట్స్ గార్డెన్ ఏరియాలో ఉన్న మీ టైమర్ లోని మిగిలి ఉన్న పూర్తి కౌంట్ డౌన్ సమయాన్ని జీరో చేసుకోవచ్చు”. అంటూ టాస్క్ నిర్వహించారు. టాస్క్ మొదలవగానే ఇటువైపు నుంచి టెనెంట్స్ అటువైపు నుంచి ఓనర్స్ ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. ముందుగా కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బజార్ కొట్టకు ఎందుకంటే టాస్క్ ఆడితేనే మనకు వాల్యూ ఉంటుంది అంటూ చెబుతాడు. అటు రీతు చౌదరి కూడా మీరు కొట్టకండి మేము కూడా బజర్ కొట్టం అంటూ చెబుతుంది. అలా రెండు వర్గాల వారు సమయాన్ని జీరో చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నమ్మకంతో పని మీరు బజర్ కొట్టకండి అంటే మీరు బజారు కొట్టకండి అంటూ ఫోన్లోనే సమయాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు. అలా రెండు వర్గాల మధ్య కెప్టెన్సీ యుద్ధం బాగానే జరుగుతున్నట్లు అనిపిస్తోంది.. మరి ఇందులో ఎవరు గెలిచారో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.