BigTV English

Whiteheads: ముఖంపై తెల్ల మచ్చలా? ఈ టిప్స్ పాటిస్తే సరి !

Whiteheads: ముఖంపై తెల్ల మచ్చలా? ఈ టిప్స్ పాటిస్తే సరి !

Whiteheads: తెల్ల మచ్చల అనేవి ముఖం మీద, ముఖ్యంగా ముక్కు, నుదుటి భాగంలో కనిపించే చిన్న చిన్న తెల్లని గుళికలు. ఇవి చర్మంలోని నూనె గ్రంథులు నుంచి వెడుదలయ్యే సెబమ్, చనిపోయిన చర్మ కణాలు,ఇతర కాలుష్యాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి. ఇవి చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల గాలి తగలకుండా తెల్లగా కనిపిస్తాయి. వీటిని శాశ్వతంగా తొలగించడానికి కొన్ని పద్ధతులు పాటించాలి . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి:
తెల్ల మచ్చలు ఏర్పడకుండా ఉండటానికి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండుసార్లు, ఉదయం, సాయంత్రం సున్నితమైన ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన నూనె, దుమ్ము, మలినాలు తొలగిపోతాయి.

2. రెటినాయిడ్స్ వాడకం:
రెటినాయిడ్స్ అనేవి విటమిన్ ఎ డెరివేటివ్స్. ఇవి చర్మ కణాల పునరుద్ధరణను వేగవంతం చేసి, చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తాయి. రెటినాయిడ్స్ ఉన్న క్రీములు, జెల్స్ డాక్టర్ల సలహా మేరకు వాడవచ్చు. ఇవి తెల్ల మచ్చలను తగ్గించడమే కాకుండా.. కొత్తవి రాకుండా నివారిస్తాయి.


3. సాలిసిలిక్ యాసిడ్ ఉపయోగం:
సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక బీటా-హైడ్రాక్సీ యాసిడ్. ఇది చర్మ రంధ్రాలలోకి లోతుగా వెళ్లి, అదనపు నూనె, చనిపోయిన కణాలను కరిగించి బయటకు పంపుతుంది. సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్‌లు, టోనర్‌లు లేదా క్రీములు వాడటం వల్ల తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

4. బెంజాయిల్ పెరాక్సైడ్ :
బెంజాయిల్ పెరాక్సైడ్ యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తెల్ల మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయ పడుతుంది. బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్న క్రీములను వాడటం వల్ల తెల్ల మచ్చల సమస్య తగ్గుతుంది.

5. స్టీమ్ చికిత్స:
ముఖానికి స్టీమ్ పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో లోపల పేరుకుపోయిన మలినాలు సులభంగా బయటకు వస్తాయి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత వేడి నీటి ఆవిరిని పట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్టీమ్ తర్వాత ముఖంపై పేరుకున్న నూనెను సున్నితంగా తుడవాలి.

6. హెర్బల్ ప్యాక్స్:
కొన్ని హెర్బల్ ఫేస్ ప్యాక్‌లు కూడా తెల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్, తేనె, నిమ్మరసం కలిపిన ప్యాక్ తెల్ల మచ్చలపై అప్లై చేయవచ్చు. ఓట్స్ చర్మాన్ని శుభ్రం చేస్తే, తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

7. ఎక్స్‌ఫోలియేషన్:
వారానికి ఒకటి లేదా రెండుసార్లు సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్ వాడాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తుంది. ఎక్కువసార్లు ఎక్స్‌ఫోలియేషన్ చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి.

Also Read: విటమిన్ డి లోపమా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్ !

8. ఆరోగ్యకరమైన జీవనశైలి :
సమతుల్య ఆహారం తీసుకోవడం, అధికంగా నీళ్లు తాగడం, తగినంత నిద్రపోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తెల్ల మచ్చలు పెరిగే అవకాశం ఉంది.

ఈ చిట్కాలు పాటించడం వల్ల తెల్ల మచ్చలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే, డాక్టర్‌ని సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులతో తెల్ల మచ్చలను గిల్లడం, నొక్కడం చేయకూడదు, దీనివల్ల ఇన్ఫెక్షన్, మచ్చలు వచ్చే అవకాశం మరింత ఉంది.

Related News

High Blood Sugar: డైలీ వాకింగ్, డైట్ పాటించినా ఆ మహిళలకు హై బ్లడ్ షుగర్ ? అదెలా సాధ్యం?

Health benefits: అగరబత్తి‌కి విక్స్ రాసి వెలిగిస్తే దగ్గు, జలుబు వెంటనే తగ్గుతుందా? నిజమేమిటి?

Scalp Care Tips: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Sugar Side Effects: చక్కెర ఎక్కువగా తింటే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Vitamin D Sources: విటమిన్ డి లోపమా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్ !

Banana: రోజూ 2 అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Jackfruit Health Tips: ఈ ఒక్క పండు తింటే.. మీ ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలు

Big Stories

×