E-Paper
Advertisement

Spirit Movie : ప్రభాస్ మూవీకి కొత్త కష్టాలు.. డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్..!

Spirit Movie : ప్రభాస్ మూవీకి కొత్త కష్టాలు.. డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్..!
Advertisement

Spirit Movie : టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రతి ఏడాది ప్రభాస్ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. కానీ ఏడాదికి ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఈ ఏడాది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే భారీ అంచనాల నడుము వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన రెండు మూడు సినిమాలలో నటిస్తున్నాడు.. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగతో చేస్తున్నారు. ఆ సినిమానే స్పిరిట్.. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వార్తలు విన్న ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. అసలు ఈ సినిమాకి వచ్చిన అతిపెద్ద కష్టమేంటో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

స్పిరిట్’ మూవీకి టైటిల్ కష్టం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘స్పిరిట్’ టైటిల్ వివాదంలో చిక్కుకుంది.. స్పిరిట్ – ఈజ్ నాట్ వన్ అనే సినిమా నిర్మాతకు టీ – సిరీస్ సంస్థ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే.. ఈ నోటీసులు పంపడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చర్చలు కూడా మొదలయ్యాయి. 8th వండర్ సినిమాస్ బ్యానర్‌పై నర్సమ్మ అనే మహిళా రైతు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వములో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని ఆమధ్య సీనియర్ హీరో సుమన్ చేతుల మీదగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ మేకర్స్ కు టీ-సిరీస్ సంస్థ లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.. ఈ నోటీసులు పై స్పందించిన మహిళ రైతు నర్సమ్మ ప్రభాస్ సినిమా కన్నా ముందే తాము ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాము అని చెబుతున్నారు.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా గురించి డైరెక్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్.. అక్షయ్ అవుట్..

ప్రభాస్ స్పిరిట్ మూవీ అప్డేట్..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ఈ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు కూడా మొదలవుతున్నాయి.. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ జనాలను బాగా ఆకట్టుకుంది.. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి కూడా నటిస్తుంది.. సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే మామూలుగా ఒక అంచనా ఉంటుంది.. ఈ మూవీ కూడా అదే విధంగా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడు ఇప్పుడు డార్లింగ్ ని స్క్రీన్ మీద చూసుకుందామా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అలాంటి సమయంలో ఇలాంటి వార్తలు వినడంపై అభిమానులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.. మరి ఈ టైటిల్ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తుంది.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి త్వరలోనే అప్డేట్ రాబోతుందని సమాచారం..

Related News

మళ్లీ మొదలెట్టావా నాగవంశీ..!

చిన్న ఊళ్లలో పీవీఆర్.. ఇక పాత థియేటర్లకు గుడ్‌బైనా?

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

Big Stories

Advertisement
×