E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ ఫైట్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. తిరుకు తప్పని తిప్పలు..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ ఫైట్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. తిరుకు తప్పని తిప్పలు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 6th :నర్మదా అసలు ఈ గొడవలకి కారణం ఎవరు వల్లి ఎక్కడ లేదా ఇంకెవరైనా ఉన్నారా అంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఒక బోర్డు మీద వాళ్ల పేర్లు అన్ని రాసుకొని పెద్ద ప్లాన్ చేస్తూ కనిపిస్తది అది చూసిన సాగర్ ఏంటే ఇంత ప్రణాళికలు ఇస్తున్నావు అసలు ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. అసలు పుట్టినరోజు ఎందుకు ఇప్పుడు పుట్టినరోజుని చేయించాలి అని అనుకుంది. ఏదో ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగు పెట్టారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ఆ తర్వాత నువ్వు నీ ప్లాన్లు ఆపేసి పడుకుంటే మంచిది అని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం నాకు అనుమానం ఇంకాస్త ఎక్కువగా ఉంది అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది..

ధీరజ్ ను దులిపేసిన ప్రేమ..

ధీరజ్ ఉదయం లేవగానే బయటే పడుకుని ఉండగా చూసిన ప్రేమ బకెట్లో నీళ్లు తెచ్చి మొహం కొడుతుంది. తాగేసి వీళ్లిద్దరు ఇలా పడిపోతారని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక వాళ్ళ మీద నీళ్లు కొట్టుగానే వర్షం పడుతుంది లే అల్లుడు అంటూ తిరుపతి ధీరజ్ని లేపుతాడు. వీళ్ళిద్దరూ లేవగానే ప్రేమ ఇంకాస్త నీళ్లు తెచ్చి వాళ్ళ పైన పోస్తుంది. మీ ఇద్దరి సంగతి చెప్తాను అని అంటుంది. మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావడం లేదు మీ సంగతి ఇట్లా కాదు అని ఇంకాస్త నీళ్లు పోస్తుంది. ప్రేమను చూసిన తిరుపతి మా అమ్మాయి ఇంత కోపంగా ఉంది మా అమ్మాయి నిప్పుల వల్లే ఈ వర్షం కురుస్తుందేమో అని ధీరజ్ కి చెప్తాడు. ఉదయం లేవగానే ధీరజ్ ప్రేమను చూసి ఏంటే నీళ్ళు కొడుతున్నావ్ అని కోపంగా కాసేపు గొడవపడతారు. శారదాంబ వచ్చి ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఉండలేకపోతున్నారా అని కావాలని మాట్లాడుతుంది.. వాడు భర్తే కాదు అని ప్రేమ ధీరజ్ అది నా భార్య కాదు అని అంటాడు.. వీళ్లిద్దరు గొడవను చూసిన వేదవతి బయటకు వచ్చి మీరిద్దరు పొద్దున్నే మొదలు పెట్టారా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఎమోషనల్ అయిన ప్రేమ..

Advertisement

ప్రేమ నువ్వు ముగ్గేస్తున్నావేంటి నీ పెద్ద కోడలు రాలేదా అని వేదవతిని అరుస్తుంది. ఇక అప్పుడు ఎక్కడికొచ్చిన నర్మదా ధీరజ్ మీద అంత ప్రేమ ఉండి కూడా నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావు.. మీ అత్తయ్య కష్టపడి పోతుందని ముగ్గేస్తున్నావా? మరి ఇంట్లోకి వచ్చేయొచ్చు కదా ప్రేమ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మాట వినగానే ప్రేమ నన్ను వాడు భార్య కాదు అని అవమానించెలా మాట్లాడాడు ఇప్పుడు నేనెలా ఆ ఇంట్లోకి రావాలి అని ఎమోషనల్ అవుతుంది. నీ బాధకు ఒక కారణం ఉంది కానీ ధీరజ్ తో మాట్లాడకపోయినా నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా అని నర్మద అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ముగ్గులు వేయడం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.. ప్రేమ త్వరలోనే ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అని అర్థమవుతుంది.

తిరుపతిని ట్రాప్ చేసిన సుక్కు..

తిరుపతి ఇంకా రాలేదు అని సుకన్య ఎదురు చూస్తూ ఉంటుంది. నీకోసం టిఫిన్ చేసి ప్రేమగా పెడితే నువ్వు ఇంకా రాలేదు ఏంటమ్మా వస్తే నీతో ఆడుకోవాలి అని అలా చూస్తూ ఉండగానే తిరుపతి సుక్కు కన్య అంటూ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక సుకన్య పట్టుకుంటే ముద్దు పెడతాను టచ్ చేస్తే హగ్ చేసుకుంటాను అని ఆఫర్ ఇవ్వగానే తిరుపతి తన వయసును కూడా పక్కనపెట్టి కాసేపు పరిగెడతాడు. ఇక సుకన్య తనని పరిగెత్తించి అలసిపోయేలా చేస్తుంది. కానీ చివరికి టిఫిన్ పెట్టడంతో ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని హ్యాపీగా ఉండగా భాగ్యం ఆనందరావు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అప్పుడే భాగ్యం వాళ్ళు వచ్చారు అని తెలుసుకొని తిరుపతి షాక్ అవుతాడు ఇక ఇడ్లీలను చూసి ఆనందరావు తనదైన స్టైల్ లో పంచులు వేస్తాడు. ఇక చివరికి పెళ్లి చేసుకోమని భాగ్యం తొందర పెడుతుంది..

అమూల్య మాటతో విశ్వం షాక్..

Advertisement

ప్రేమ, ధీరజ్ లను కలపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు విశ్వం. అమూల్య కాలేజ్ దగ్గర వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య రాగానే ధీరజ్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు నా వెనకాల పడుతున్నావ్? నీ మీద ఉన్న కేసును వెనక్కి తీసుకొని నేను తప్పు చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని అమూల్య సీరియస్ అవుతుంది.. వాళ్ళని కలపడానికి మా ఇంట్లో పెద్ద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ నాటకాలు మొదలు పెట్టొద్దు అని విశ్వం ని అవమానించేలా మాట్లాడుతుంది. విశ్వం ఎంత చెప్తున్నా సరే అమూల్య మాత్రం అస్సలు వినకపోవడంతో షాక్ అవుతాడు. ఆకలితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: ఫస్ట్ టైమ్ బాబును ఎత్తుకున్న పల్లవి.. అవని పూజ.. అడ్డంగా దొరికిన మగాళ్లు…

Related News

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Big Stories

Advertisement
×