Tollywood Actors:ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెలబ్రెటీలందరి బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. ఇండస్ట్రీలో వాళ్ళ ఫాదర్లు,తాతలు, సోదరులు ఏదో ఒక స్థానంలో సెటిల్ అయిన వారే. ప్రొడ్యూసర్లుగా, దర్శకులుగా, హీరోలుగా రాణించిన పెద్దపెద్ద సెలబ్రిటీలు వాళ్ల వెనుక ఉన్నారు. కానీ ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏం లాభం.. వీరికి ఇండస్ట్రీలో ఏమాత్రం అదృష్టం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ గా ఉన్నారు. మరి ఇంతకీ స్టార్ కిడ్స్ అయినా కూడా ఇండస్ట్రీలో రాణించని వాళ్ళు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
దగ్గుబాటి అభిరామ్..
దగ్గుబాటి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. దగ్గుబాటి రామానాయుడు (Rama Naidu) ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఈయనకి మూవీ మొఘల్ అనే పేరు కూడా ఉంది.అయితే అలాంటి రామానాయుడు వారసత్వంగా ఇండస్ట్రీలోకి హీరోగా వెంకటేష్ (Venkatesh), ప్రొడ్యూసర్ గా సురేష్ బాబు ఇద్దరూ సక్సెస్ అయ్యారు. అలాగే సురేష్ బాబు కొడుకు రానా (Rana) కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) మాత్రం సినిమాల్లో రాణించలేకపోయారు. ఈయనకు బ్యాగ్రౌండ్ ఏ మాత్రం పనికి రాలేదని చెప్పుకోవచ్చు. అహింస అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఈ మూవీ ఫ్లాప్ అయింది.
అల్లు శిరీష్..
ఇక మరో నటుడు అల్లు శిరీష్(Allu Sirish).. అల్లు ఫ్యామిలీకి కూడా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కమెడియన్ అయినటువంటి అల్లు రామలింగయ్య వారసత్వంగా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ దిగ్గజ నిర్మాతగా మారారు. ఇక ఈయన ముగ్గురు కొడుకుల్లో రెండో కొడుకు అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్ గా మారారు. కానీ మూడో కొడుకు అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు మాత్రం రావడం లేదు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,బెల్లంకొండ గణేష్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ ఇద్దరికీ ఇండస్ట్రీలో అంత గుర్తింపు అయితే లేదు. స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయులుగా భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సినిమాల్లో వీళ్లు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ బెల్లంకొండ గణేష్ 2,3సినిమాలు చేసినప్పటికీ అవి హిట్ కాలేదు.
ఆర్యన్ రాజేష్..
స్టార్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈవీవీ సత్యనారాయణ ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అలా చిన్న కొడుకు అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆర్యన్ రాజేష్ (Aaryan Rajesh) మాత్రం ఇండస్ట్రీలో రాణించలేకపోయారు.తండ్రి స్టార్డం ఈయనకు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరమై బిజినెస్ చేసుకుంటున్నారు.
సుమంత్ అశ్విన్..
అలాగే దర్శక నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin) కి కూడా టాలీవుడ్ లో పాపులారిటీ లేదు. ఈయన చేసిన సినిమాలు ఒకటో రెండో సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం రాణించలేకపోయారు.
గౌతమ్..
అంతేకాకుండా టాలీవుడ్ లో కామెడీ బ్రహ్మాగా పేరున్న బ్రహ్మానందం (Brahmanandam) తనయుడు గౌతమ్ కూడా సినిమాల్లో రాణించలేకపోయారు.ఈయన నటించిన రెండు మూడు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఆనంద్ దేవరకొండ..
అలాగే రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)కూడా మంచి మంచి సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే దక్కలేదు.
ఎమ్మెస్ నారాయణ తనయుడు విక్రమ్..
ఇక ఈ హీరోలు మాత్రమే కాకుండా ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. వారిలో ఎమ్మెస్ నారాయణ తనయుడు విక్రమ్(Vikram) కూడా ఒకరు.
మంచు వారసులు..
మంచు మోహన్ బాబు తనయులు విష్ణు (Vishnu),మనోజ్ (Manoj) కూడా ఈ జాబితాలోకి చేరిపోతారు. ఎందుకంటే మోహన్ బాబు(Mohan Babu)కి టాలీవుడ్ లో ఎంత గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు.కానీ తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మనోజ్,విష్ణులు ఇండస్ట్రీలో ఓ మోస్తారు హీరోలుగా తప్ప తండ్రి అంతటి గుర్తింపు మాత్రం పొందలేకపోయారు.
రమేష్ బాబు..
అలాగే కృష్ణ(Krishna) పెద్ద కొడుకు రమేష్ బాబుని పెద్ద హీరోని చేయాలని కృష్ణ ఎన్నో కలలు కన్నారు. కానీ రమేష్ బాబుకి గుర్తింపు రాలేదు.
అఖిల్ అక్కినేని..
నాగార్జున రెండో కొడుకు అఖిల్(Akhil) కి కూడా సక్సెస్ రావడం లేదు.
మెగా వారసులు..
అలాగే మెగా ఫ్యామిలీ వంటి భారీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వరుణ్ తేజ్ (Varun Tej),సాయి ధరంతేజ్ (Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అలా ఇండస్ట్రీలో భారీ బ్యాగ్రౌండ్,స్టార్ కిడ్స్ అనే పేరున్నా కూడా ఫెయిల్యూర్లుగా నిలిచిన సినీ వారసులు ఎంతో మంది ఉన్నారు.
ALSO READ:Tollywood: అటు డాక్టర్స్.. ఇటు యాక్టర్స్.. ఈ సెలెబ్రిటీస్ భలే మేనేజ్ చేస్తున్నారే?