Rajini – Kamal : కోలీవుడ్ దిగ్గజ నటులు రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి నటించే సినిమా కోసం మూవీ లవర్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్లు వాళ్ల కెరియర్ స్టార్టింగ్‌లో కలిసి నటించారు. అయితే… ఇప్పుడు వీళ్లు మల్టీస్టారర్ చేయాలని చూస్తున్నారు. కానీ, డైరెక్టరే దొరకడం లేదు.
రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీ స్టారర్ అంటూ వార్తలు వచ్చిన తర్వాత ముందుగా వచ్చిన ఆప్షన్ లోకేష్ కనగరాజ్. ఈ యంగ్ డైరెక్టర్‌కు కమల్ హాసన్‌తో సినిమా చేసిన అనుభవం ఉంది. అలాగే రజనీకాంత్‌తో సినిమా చేసిన అనుభవం కూడా ఉంది.
దీంతో ఈ బిగ్ మల్టీస్టారర్ డీల్ చేయడానికి లోకేష్ కనగరాజే కరెక్ట్ అనుకున్నారు. కానీ, రజనీకాంత్‌తో చేసిన కూలీ మూవీ అభిమానులను నిరాశపరిచింది. ఆ ఎఫెక్ట్ ఈ బిగ్ మల్టీస్టారర్‌పై పడింది. అది ఒక్కటే కాదు.. మరి కొన్ని కారణాల వల్ల కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు లోకేష్ కనగరాజ్ ఫైనల్ అవ్వలేదు.
దీని తర్వాత… ఈ బిగ్ మల్టీ స్టారర్ కోసం మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. అతనే ప్రదీప్ రంగనాథన్. ఇతను లవ్‌టూడే అనే సినిమాను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఇప్పుడు హీరోగా డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ప్రదీప్ రంగనాథన్‌కు ఉన్న మరో అవకాశం ఏంటంటే… రజనీకాంత్ యంగ్ డైరెక్టర్‌ను ప్రొత్సహిస్తాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చిన తర్వాత… రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీ స్టారర్‌కు డైరెక్టర్ దొరికినట్టే అంటూ తమిళ మీడియా కోడై కూసింది.
కానీ, సడన్‌గా ట్విస్ట్ వచ్చింది. ప్రదీప్ రంగనాథనే స్వయంగా… తాను రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీని డైరెక్ట్ చేయడం లేదు అంటూ ప్రకటించాడు. దీంతో ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీకి మళ్లీ డైరెక్టర్ కష్టాలు వచ్చాయి. ప్రదీప్ తర్వాత… తెరపైకి వచ్చిన మరో డైరెక్టర్ పేరు.. కార్తిక్ సుబ్బరాజు.
కార్తిక్ సుబ్బరాజు స్టోరీ గానీ, ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు గానీ, బానే ఉంటాయి. కానీ, ఈయన డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన రెట్రో మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఆ ఎఫెక్ట్ వల్ల ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీ దూరం అయినట్టు తెలుస్తుంది.
ఫైనల్‌గా ఈ రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీని డీల్ చేయడానికి ఓ కోలీవుడ్ డైరెక్టర్ రెడీ అయినట్టు తెలుస్తుంది. అతను ఎవరో కాదు… రజనీకాంత్‌కు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం ఈయన రజనీకాంత్ తోనే జైలర్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రజనీకాంత్ – కమల్ హాసన్ మూవీని స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.
ఇలా ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీ ఆలోచన వచ్చినప్పటి నుంచి డైరెక్టర్ కష్టాలు వస్తూనే ఉన్నాయి. మూవీ స్టార్టింగ్‌లోనే ఇబ్బందులు వస్తే… సినిమా స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటో అని సినీ లవర్స్ అనుకుంటున్నారు.