Outer Ring Road Train: తెలంగాణలో రైల్వే రవాణ వ్యవస్థ కొత్తపుంతలు తొక్కబోతోంది. ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ రైల్వేకు సంబంధించిన ఫైనల్ లొకే షన్ సర్వే ప్రక్రియ పూర్తి అయ్యింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగించే 6 రైలు మార్గాలతో ఈ రైల్వే అనుసంబంధానం కానుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మూడు అలైన్ మెట్లతో కూడిన ప్రతిపాదనలను సౌత్ సెంట్రల్ రైల్వే రూపొందించింది. వీటిని అన్ని రకాలుగా పరిశీలించి ఒక అలైన్ మెంట్ ను ఫైన్ చేయనున్నారు.
10 జిల్లాలకు ప్రయోజనం కలిగేలా..
ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులతో పలు జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సులభమవుతాయి. ఆయా జిల్లాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రంతానికి రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ పరిసరాల్లోని 10 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. పలు జిల్లాల్లో కొత్తగా రైల్వే స్టేషన్లనూ నిర్మించనున్నారు.
6 రైల్వే కారిడార్లతో అనుసంధానం
ఇక ఈ ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు మొత్తం 6 రైల్వే కారిడార్లతో అనుసంధానం కానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ముంబై, వరంగల్, గుంటూరు సహా ప్రధాని రైల్వే కారిడార్లు లింక్ కానున్నాయి. ఫలితంగా గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించే అవకాశం ఉంటుంది. ఈ రైళ్లు అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణాలు కొనసాగించనున్నాయి. ఈ రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ కు రాకుండా రింగ్ రైలు మార్గం ద్వారా ఇతర మార్గాలకు మళ్లించే అవకాశం ఉంటుంది. ఈ మళ్లింపు ద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.
దేశంలోనే తొలిసారి..
సాధారణంగా ఓ సిటీ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు ఉండటం కామన్. కానీ, తొలిసారి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపడుతున్నారు. బెంగళూరు, చెన్నై, ముంబాయి లాంటి ముఖ్య నగరాల్లో రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్స్ నిర్మించారు. కానీ, రింగు రైలు ఆలోచన లేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఔటర్ రింగు రైలు ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. 2023 సెప్టెంబర్ లో ఫైన్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ సర్వే పూర్తి అయ్యింది.
Read Also: హైదరబాద్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్.. కేంద్రం కీలక నిర్ణయం!
10 జిల్లాలకు లాభం కలిగే అవకాశం
ఔటర్ రింగు రైలు అలైన్ మెంట్లలో ఆప్షన్ 1, 3 ఎనిమిది జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి. వీటిలో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. రెండో అలైన్ మెంట్ లో ఈ 8 జిల్లాలతోపాటు జనగామ, కామారెడ్డి జిల్లాలు ఉంటాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో 10 జిల్లాలకు మేలు కలిగే అవకాశం ఉంటుంది.
Read Also: హైదరబాద్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్.. కేంద్రం కీలక నిర్ణయం!