దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపి ఎమ్మెల్సీగా కంటే, దివ్వెల మాధురి ప్రియుడిగానే ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. మాధురి.. దువ్వాడతో ప్రేమలో పడటం, ఆ తర్వాత అతడి అసలు కుటుంబంతో గొడవపడటం, రోడ్డు ప్రమాదాల డ్రామా ఆడటం.. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ట్విస్ట్.. రాస్తే రామాయణం, చెప్తే భారతం అవుతుంది. మొత్తంగా సుమారు మూడున్నర పదుల వయసు ఉండే మాధురి, తనకంటే ఇంచుమించు రెంటింపు వయసున్న శ్రీనివాస్ తో హ్యాపీగా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గానే మాధురి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. తొలుత ఆమె వ్యవహార శైలిపై వీక్షకులు నెగెటివ్ గా కామెంట్స్ చేసినా, ప్రస్తుతం అందరితో కలిసిపోయి చక్కగా గేమ్ ఆడుతోంది.
ఇక తాజాగా తనను, మాధురిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారి గురించి దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ట్రోలర్స్ అన్నారు. వారికి ధన్యవాదాలు చెప్పారు. “నేను ట్రోలర్స్ అందరికీ శిరస్సు వంచి నమసకరిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ స్థాయికి వచ్చాం అంటే దానికి వాళ్లే కారణం. ట్రోలర్స్ ను నేను విమర్శించను. ఎందుకంటే టెక్కలి వరకు పరిచయం అయిన నన్ను జిల్లా వరకు తీసుకెళ్లింది మా టెక్కలి ప్రజలు అయితే, జిల్లా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లింది ట్రోలర్స్. ఎవరు దువ్వాడ శ్రీనివాస్, ఎవరు మాధురి అనే ఆసక్తి కలిగించింది కూడా వాళ్లే. ట్రోలింగ్ చేసే సోదర, సోదరీమణులు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్లు మమ్మల్ని ఎంత గట్టిగా తిడితే, అంత గట్టిగా మేం ముందుకు వెళ్తాం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రోలర్స్ గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడ్డం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా దువ్వాడ గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అటు బిగ్ బాస్ షో నుంచి భరణి ఎలిమినేట్ కావడానికి దువ్వాడ శ్రీనివాస్ కారణం అనే ఆరోపణలు కూడా వచ్చాయి. షోలో మాధురి, భరణితో క్లోజ్ గా ఉండటం ఇష్టం లేక ఆయనే ఈ పని చేయించాడని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే.. ఈ విమర్శలపై దువ్వాడ స్పందించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. గేమ్ గురించి తెలియని కొంత మంది మూర్ఖులు ఇలాంటి కామెంట్స్ చేశారాన్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పారు. భరణి చక్కగా గేమ్ ఆడినప్పటికీ, ఆయన చేసిన మిస్టేక్స్ ఎలిమినేషన్ కు కారణం అయ్యిందన్నారు. ఆట మీద దృష్టి పెట్టకుండా బంధాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. నిజానికి ఆయన టాప్ 5లో ఉంటారని తాను ఊహించానన్నారు. ఆయన ఎలిమినేషన్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు దువ్వాడ.
Read Also: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?