Director Sampath Nandi : టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. వయసు మీద పడడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.. డైరెక్టర్ స్వగృహంలో తండ్రి మరణించినట్లు తెలుస్తుంది.. టాలీవుడ్ డైరెక్టర్ అయిన సంపత్ నంది తండ్రి చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సన్నిహితులు ఆయన తండ్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.. తండ్రి మరణం డైరెక్టర్ కు తీరని లోటు. తన తండ్రి పడ్డ కష్టాలను గుర్తు చేసుకొని సంపత్ నంది ఎమోషనల్ అవయ్యారు.. ఆయన అత్యంత సన్నిహితులు కిష్ణయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులు బంధువులు, సన్నిహితులు, అంత్యక్రియలలో పాల్గొనేందుకు సంపత్ నంది స్వగృహానికి చేరుకున్నారు.. ఇవాళ సాయంత్రం డైరెక్టర్ స్వగ్రామంలోనే తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు హాజరుకానున్నారు..
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కన్నతండ్రి నంది కిష్ణయ్య మృతి చెందారు. ఏడు పదుల వయసు దాటడంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఆయనను భాదిస్తూ వచ్చేవి. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రేయోభిలాషులు, సన్నిహితులు సంపత్ నంది, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. వారి స్వస్థలం ఓదెలలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.. ఇప్పటికే ఇంటికి బంధువులు, మిత్రులు తరలివచ్చారు. తండ్రి మరణం డైరెక్టర్ కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. ఆయనను తలచుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు..
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాలు హిట్ అవ్వడంతో డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. మొదటి సినిమా ‘ఏమైంది ఈవేళ’. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సంపత్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ మూవీకి దర్శకత్వం వహించారు.. ఆ తర్వాత బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’.. సినిమాలు చేశారు. అంతేలేకాదు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యాడు.. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఓదెల 2’ చిత్రం 2024లో అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం ఈయన హీరో శర్వానంద్ తో కలిసి భోగి అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. వచ్చే థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం..