Yelahanka Palace: షర్మిలకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. యలహంక ప్యాలెస్ వివాదం పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక వివరాల్లోకి వెలితే.. యలహంక ప్యాలెస్ భూవివాదంలో జగన్ వర్గానికి ఊరట లబించింది. సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులకు వివాదాస్పద స్థలంలోకి ప్రవేశంపై నిషేధం కోర్టు నిషేదం విదించింది. యలహంక స్థలంలోకి వెళ్లడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం, ఆస్తులకు నష్టం కలిగించడం నిషేధం అని కోర్టు క్లారిటీ ఇచ్చింది. స్థలంలోని చెట్లు, నిర్మాణాలు, ఇతర ఆస్తులను యథాతథంగా కాపాడాలని ఆదేశం ఇచ్చింది.
ఈ కేసు తుది పరిష్కారం అయ్యే వరకు ఆస్తి విషయంలో షర్మిల జోక్యం చేసుకోరాదని బెంగుళూరు కోర్టు స్పష్టీకరణ చేసింది. కుటుంబ సభ్యులు, అనుచరులు సైతం ఎలాంటి చర్యలకు పాల్పడరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమైన షర్మిలకు కోర్టు ఉత్తర్వులతో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారడంతో రాజకీయంగా ఈ అంశం సంచనలంగా మారింది.
Also Read: యలహంక ప్యాలెస్‌లోకి షర్మిలను రానివ్వొద్దంటూ.. కోర్టులో జగన్ పిటిషన్!