Tollywood : ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమంది గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ చనిపోతున్నారు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఈ నటి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎన్నో సినిమాలలో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన పావలా శ్యామల ఇకలేరు అన్న వార్త విన్న సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలోని సీనియర్ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలి యందు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె ఆరోగ్య పరిస్థితి దినస్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. చివరికి ఆ అనారోగ్య సమస్యలతోనే పోరాడుతూ ఆమె మృత్యువు ఒడిలోకి చేరారు.. సినీ ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయింది అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.. నేడు ఆమెకు అంత్యక్రియలను జరపనున్నట్లు సమాచారం..
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. ఈమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కూతురి దీనస్థితి..పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి యందు సినీ అభిమానులు దేవుడుని ప్రార్థిస్తున్నారు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాలలో నటించి, తనదైన హాస్యంతో మెప్పించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవిత ప్రయాణం ఎన్నో ఇబ్బందికర పరిస్థితి లను చూసింది.. ‘బాబాయ్ హోటల్’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘గోలిమార్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఇక లేరు అన్న వార్త చాలామందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. చివరి రోజుల్లో శేష జీవితాన్ని సంతోషంగా గడపాల్సిన ఈ నటి ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు అనారోగ్య సమస్యలు ఆమెని మరింత కృంగిపోయేలా చేసాయి. దాంతో ఆమె పరిస్థితి దీనంగా మారిపోయింది. దయనీయ స్థితిలోకి వెళ్లిన పావలా శ్యామల చివరికి గుండెపోటుతో మరణించారు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అంటూ పలువురు అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..
Also Read :‘పొదరిల్లు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..