E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సుమిత్ర ఇంట్లో శివనారాయణ, దక్షిణమూర్తి ఒకరినొకరు తోసుకోవడం ఆ తోపులాటలో దక్షిణమూర్తి షర్ట్ చిరిగిపోవడం జరగుతాయి. అందరూ వాళ్లిద్దరిని ఆపేస్తారు. తర్వాత ఎవరు ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు.

ఇంటికి వెళ్లిన శివనారాయణ అందరినీ పిలిచి కాంచన ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తాడు. ఆ దక్షిణమూర్తి కాళ్లు నేను పట్టుకోవాలట. అది జరగని పని అలాగే ఇంట్లో ఎవ్వరూ కూడా వాళ్లను గుర్తు చేసుకోకూడదు.. వాళ్ల గురించి మాట్లాడుకోకూడదు అంటూ చెప్తుండగానే.. సూరజ్‌ వస్తాడు. నీతో మాట్లాడాలి తాత అని చెబితే.. శివనారాయణ కోపంగా ఎవడ్రా నీకు తాత ఇంకొక్క అడుగు ముందుకు వేశావంటే నిన్ను ఇక్కడే షూట్‌ చేస్తాను దశరథ ఆ గన్‌ అందుకో అని చెప్పగానే.. సూరజ్‌ కోపంగా ఎందుకు తాత అంత మూర్ఖంగా మాట్లాడతావు అంటాడు. సూరజ్ ఆ మాటకు శివనారాయణ కోపం నశాలానికి ఎక్కుతుంది.

Advertisement

అప్పుడే జ్యోత్స్న వెళ్లి ఏం మాట్లాడుతున్నావురా అంటూ తిడుతుంది. సూరజ్‌ మాత్రం మీ గురించి మా అమ్మ చెప్పినప్పుడు కాస్త నమ్మలేదు. మా అమ్మే ఏమైనా పొరపాటు పడిందేమో అనుకునేవాడిని కానీ ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చింది. మా నాన్న చావుకు మీరే కారణం అయ్యుంటారు. ఈరోజు ఇంత చిన్న గొడవకే ఇంతలా రెచ్చిపోతున్నారంటే ఆరోజు ఇంకెంత రెచ్చిపోయి ఉంటారో అర్థం చేసుకోగలను. మా నాన్న చావుకు మీరే కారణం అంటూ తిడుతుంటాడు. జ్యోత్స్న కోపంగా మీరే మా కుటుంబం మొత్తాన్ని చంపాలని చూశారు. అది జరగలేదని నింద మా మీద వేశారు అంటుంది.

సూరజ్‌ మాత్రం మీతో కలిసి పోవడానికి మా తాత మీ ఇంటి గుమ్మం తొక్కాడు. మా అమ్మ మారిపోయింది. మేం మీతో కలవాలని ఎంత  ముందడుగు వేసినా  మీరు మాత్రం ఒక్క అడుగు కూడా వేయడం లేదు మీ తాత ఓ మూర్ఖుడు అనడానికి ఇవాళ మా తాతకు జరిగిన అవమానమే నిదర్శనం అంటాడు సూరజ్‌. నువ్వు హంతకురాలి కూతురువి కాబట్టే నీకు ఇలా జరిగింది అంటూ సూరజ్‌ చెప్తుంటే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను కొడుతుంది. ఎవర్రా హంతకురాలు నా ఇంటికి ఇచ్చి నా తల్లినే హంతకురాలు అంటావా..? అంటూ తిడుతుంటే.. సూరజ్‌ కోపంగా మా తాతకు జరిగిన అవమానికి ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ వార్నింగ్‌ ఇస్తే.. నేను కూడా సేమ్‌ వార్నింగ్‌ ఇస్తున్నాను.. ఇంకోసారి ఈ ఇంటికి రావొద్దు ఈ ఇంట్లో మంచి వాళ్లకు మాత్రమే స్థానం ఉంటుంది అని జ్యోత్స్న చెబితే అయితే మీరంతా బయటకు వెళ్లాల్సిందే.. అంటూ వెళ్లిపోతాడు సూరజ్‌.

Advertisement

చెంపదెబ్బతో సూరజ్‌, షర్ట్‌ చిరిగిపోయి దక్షిణమూర్తి అవమాన భారంతో ఇంట్లో కూర్చుంటే మాలిని కోపంగా సుమిత్రకు కాల్ చేస్తుంది. సూరజ్‌ను జ్యోత్స్న ఎందుకు కొట్టిందని ప్రశ్నిస్తుది. అందుకు సుమిత్ర తన కూతురు మంచిపనే చేసింది. నువ్వు నీ కొడుక్కి విషం ఇచ్చి పెంచావు ఒక ఆడదాని మీదకు ఆయుధంగా వదిలావు.. ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకున్న వాడికి ఇలాగే జరగాలి అని సుమిత్ర చెప్తుంది. మరోసారి నా ఇంటి గుమ్మం తొక్కితే ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుంది అంటూ హెచ్చరిస్తూ కాల్ కట్‌ చేస్తుంది సుమిత్ర. మాలిని కోపంతో రగిలిపోతూ ఆ కుటుంబానికి నేనేంటో చూపించాలి. ఈ అవమానానికి బదులు తీర్చుకోవాల్సిందే.. శివనారాయణ కుటుంబానికి విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అనుకుంటుంది.

తర్వాత మాలిని వెల్లి కార్తీక్‌ దీపలను కలుస్తుంది. మిమ్మల్ని అవమానించిన  ఆ శివనారాయణకు బుద్ది చెప్పాలని మీకు లేదా అయితే నాతో చేయి కలపండి ఇద్దరం కలిపి వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటే దీప కోపంగా మాలిని చేయి నలిపేసి సుమిత్రమ్మ నాకు తల్లి లాంటిది వాళ్లకు అన్యాయం ఎలా చేస్తాను అనుకున్నావు అంటూ తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×