E-Paper
Advertisement

మ్యాచ్ మ‌ధ్య‌లో క‌ల‌క‌లం…దీప్తి శర్మను బెదిరించిన‌ నిగర్ సుల్తానా

మ్యాచ్ మ‌ధ్య‌లో క‌ల‌క‌లం…దీప్తి శర్మను బెదిరించిన‌ నిగర్ సుల్తానా
Advertisement

Deepti Sharma vs Nigar Sultana Verbal Fight: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026) చివరి దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఫైనల్స్ బరిలో నిలిచింది. నిన్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా ఉమెన్స్ టీమ్ ఇండియా వర్సెస్ మహిళల బంగ్లాదేశ్ (India Women vs Bangladesh Women, Semi Final 1 ) మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఉమెన్స్ టీమిండియా 40 పరుగుల తేడాతో విక్టరీని నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ఫైనల్స్ లో అడుగు పెట్టింది టీమిండియా. అయితే ఈ తొలి సెమీఫైనల్ సందర్భంగా బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా, టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma vs Nigar Sultana Verbal Fight) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో  ఒక‌రిపై మ‌రోక‌రు బండ‌బూతులు తిట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మ్యాచ్ మ‌ధ్య‌లో క‌ల‌క‌లం…దీప్తి శర్మను బెదిరించిన‌ నిగర్ సుల్తానా

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్న దుబాయ్ వేదికగా జరిగింది. రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే చేజింగ్ చేసేటప్పుడు ఒత్తిడికి లోనైనా కెప్టెన్ నిగర్ సుల్తానా, ఓవరాక్షన్ చేసింది. దీప్తి శర్మ బౌలింగ్ చేస్తున్నప్పుడు.. స్టేట్ డ్రైవ్ ఆడింది నిగర్ సుల్తానా. అయితే ఆ బంతిని వెంటనే పట్టుకున్న దీప్తి శర్మ, రివర్స్ త్రో విసిరింది. అయితే ఆ సమయంలో వికెట్లకు తగలకుండా తన కాళ్ళను అడ్డుపెట్టింది నిగర్ సుల్తానా.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

ఈ క్రమంలో బంతి నేరుగా నిగర్ కాలుకు తగిలింది. దీంతో రెచ్చిపోయిన దీప్తి శర్మ.. కాళ్లు ఎందుకు అడ్డు పెడుతున్నావు ? అని ప్రశ్నించింది. బరా బర్ కాళ్లు అడ్డం పెడతా అన్నట్లుగా నిగర్ సుల్తానా రిప్లై ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇంతలోనే అంపైర్లు కలగజేసుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత 19 పరుగుల వద్ద ప్రేమ రావత్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయింది నిగర్ సుల్తానా.

40 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ

Advertisement

ఆసియా కప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిడియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 149 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తేలిపోయిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో టీమ్ ఇండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇక శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ లో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్ ఆడనుంది.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

 

Related News

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

Big Stories

Advertisement
×